S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/08/2018 - 04:07

న్యూఢిల్లీ, మార్చి 7: విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేంద్రంలో ఆధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

03/08/2018 - 02:46

న్యూఢిల్లీ, మార్చి 7: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రి పి అశోకగజపతిరాజు, శాస్త్ర విజాన శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ రాజీనామాలు అందజేస్తారు. బుధవారం అర్థరాత్రి వరకూ పార్టీ నేతలతో సమావేశమై, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని టెలిఫోన్‌లో మంత్రులకు తెలియజేశారు.

03/08/2018 - 02:46

న్యూఢిల్లీ, మార్చి 7: ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేం. దాని ప్రయోజనాలను ప్యాకేజీగా మాత్రమే ఇవ్వగలం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుండబద్ధలు కొట్టారు. అయితే కేంద్రం ఇస్తానన్న నిధులను ఎలా తీసుకోవాలన్న అంశంపై ఏపీ తేల్చుకోలేకపోవడం వల్లే ఇబ్బంది వస్తుందని స్పష్టం చేశారు. దానికి కేంద్రాన్ని బాధ్యుల్ని చేయడం సహేతుకం కాదని అంటూనే, విభజన చట్టంలోని ప్రతి హామీనీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

03/08/2018 - 02:44

బడ్జెట్ పార్లమెంట్ పూర్తిగా గతి తప్పింది. ఉభయ సభల నిర్వహణకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో వాయిదాల పర్వమే నడుస్తోంది. ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ ఎంపీలు, కావేరీ జలాలపై తమిళనాడు ఎంపీలు, ముస్లిం రిజర్వేషన్లపై తెలంగాణ ఎంపీలు.. వీళ్ల డిమాండ్లకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ సహా బీజేపీయేతర ఎంపీలు ఆందోళనల బాట పట్టడంతో మహాత్ముని సాక్షిగా పార్లమెంట్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

03/07/2018 - 16:18

న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌కు స‌మీపంలో ఆయ‌న‌ ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టింది. తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని ప్రమాదం అనంతరం తొగాడియా ఆరోపించారు.

03/07/2018 - 16:40

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని డిఎంకె నేత కనిమొళి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షకు ఆమె సంఘీభావం ప్రకటించారు. విభజన చట్టంలోని హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, ఆంధ్రుల పోరాటానికి అండగా ఉంటామని అన్నారు.

03/07/2018 - 16:48

న్యూఢిల్లీ: త్రిపురలో మార్క్సిస్టు ప్రముఖుడు లెనిన్, తమిళనాడులో పెరియార్ విగ్రహాలను విధ్వంస ఘటనల్లో పార్టీవారి ప్రమేయం ఉంటే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. విగ్రహాల విధ్వంసాన్ని ఏమాత్రం సహించమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారతదేశం భిన్న ఆలోచనలకు, సిద్ధాంతాలకు ఆలవాలమని నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

03/07/2018 - 16:37

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఖర్గే అన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయటంలో బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. బుధవారంనాడు పార్లమెంట్ స్ట్రీట్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆత్మగౌరవ దీక్షలో ఆయన మాట్లాడుతూ..హక్కుల సాధన కోసం ఏపీ ప్రజల వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు.

03/07/2018 - 16:43

పనాజీ: వైద్య చికిత్స నిమిత్తం గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ మంగళవారం రాత్రి అమెరికా వెళ్లారు. వైద్యుల సూచన మేరకు తాను అమెరికా వెళ్తున్నట్లు గోవా గవర్నర్‌ మృదులా సిన్హాకు రాసిన లేఖలో ఆయన‌ పేర్కొన్నారు. సోమవారం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన పారికర్‌.. అక్కడి నుంచి నిన్న రాత్రి అమెరికా వెళ్లారు. కాగా..

03/07/2018 - 13:22

ముంబై: దివంగ‌త న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ త‌న 21 వ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ముంబైలోని వృద్ధాశ్ర‌మంలో జ‌రుపుకుంది. తొలి సారి త‌న త‌ల్లి లేకుండా కేక్ క‌ట్ చేసింది. చిన్నారుల‌తో పాటు వృద్ధ మ‌హిళ‌లు బ‌ర్త్ డే సాంగ్ పాడ‌గా, ఆ త‌ర్వాత జాన్వీ కేక్ క‌ట్ చేసింది. వృద్ధాశ్ర‌మంలో పుట్టిన రోజు జ‌రుపుకున్న జాన్వీ ఆ త‌ర్వాత త‌న క‌జిన్ సోన‌మ్ క‌పూర్ ఏర్పాటు చేసిన వేడుక‌లో పాల్గొంది.

Pages