S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/06/2018 - 04:16

జమ్ము, ఫిబ్రవరి 5: సరిహద్దు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పొరుగు దేశం పాకిస్తాన్‌తో భారత్ శాంతి చర్చలు పునరుద్ధరించాలని కాశ్మీర్ అసెంబ్లీ డిమాండ్ చేసింది. తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ లోయ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న పాక్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పాక్ కవ్వింపు చర్యలపై మొదలైన చర్చతో కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది.

02/06/2018 - 03:38

చండీగఢ్, ఫిబ్రవరి 5: ఆదివారం సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన కెప్టెన్ కపిల్ కండు కేవలం 22ఏళ్ల యువకుడు. ఈ నెల 10న ఆయన 23వ ఏట అడుగుపెట్టనున్నారు. పుట్టిన రోజుకు స్వగ్రామం హర్యానాలోని రన్సికా గ్రామం వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది.

02/06/2018 - 03:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ నిబంధన-184 కింద తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోకసభ సెక్రటరీ జనరల్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటిసు ఇచ్చారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అమలు చేయాలని రాజ్యసభ తీర్మానం చేసిందిని, ప్రత్యేకహోదా 15 ఏళ్లకు పొడిగిస్తూ సభ తీర్మానించింది.

02/06/2018 - 03:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: యువతులు, మహిళలను తన ఆశ్రమంలో అక్రమంగా నిర్బంధించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరేంద్రదేవ్ దీక్షిత్‌పై లుక్‌ఔట్ సర్కులర్ జారీ చేశామని సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. దేశ రాజధానిలో దీక్షిత్ నిర్వహిస్తున్న ఆశ్రమాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ గీతామిట్టల్, జస్టిస్ సి.హరిశంకర్‌ల ధర్మాసనానికి సీబీఐ ఈ మేరకు తమ చర్యను వివరించింది.

02/06/2018 - 03:32

జమ్ము, ఫిబ్రవరి 5: గడచిన మూడేళ్లలో పాకిస్తాన్ 834సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఈ కాల్పుల్లో 97మంది ప్రాణాలు కోల్పోయారని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. జమ్ముకశ్మీర్ విధాన మండలి సమావేశంలో పీడీపీ ఎమ్‌ఎల్‌సి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ప్రభుత్వం ఈ విషయం పేర్కొంది.

02/06/2018 - 03:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల్లో దర్యాప్తు కోసం నూతనంగా ఏర్పడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో సభ్యుడిగా మాజీ డీజీ ర్యాంకు అధికారి నవనీత్ రాజన్ వాసన్‌ను చేర్చేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ బృందంలోని విశ్రాంత ఐజీ ర్యాంకు అధికారి రాజ్‌దీప్ సింగ్ స్థానంలో వాసన్‌ను నియమించాలని కేంద్రం కోరింది.

02/06/2018 - 03:31

మాలె, ఫిబ్రవరి 5: రాజకీయ సంక్షోభం మరింత ముదిరి పరిస్థితులు చేజారిపోతున్న నేపథ్యంలో మాల్దీవుల్లో అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తూ దేశాధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూమ్ సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ పదిహేను రోజులపాటు అమల్లో ఉంటుందని, ఎవరినైనా, ఎక్కడైనా తనిఖీ చేసి అదుపులోకి తీసుకునే అధికారం భద్రతా బలగాలకు ఉంటుందని న్యాయవ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు.

02/06/2018 - 01:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: జమిలి ఎన్నికల నిర్వహణకు అంద రూ అంగీకరించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పిలుపిచ్చారు. సోమవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ ఈ పిలుపిచ్చారు. అమిత్ షా రాజ్యసభ సభ్యత్వం చేపట్టిన తరువాత సభలో తొలిసారి ప్రసంగించారు.

02/06/2018 - 01:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: కొత్త రాష్టమ్రైన ఏపీకి బడ్జెట్‌లో తీరని అన్యాయమే జరిగిందంటూ తెలుగుదేశం ఎంపీలు సోమవారం పార్ల మెంట్‌లో రగడ సృష్టించారు. విభజన హామీ లు నెరవేరుస్తారని కేంద్రంపై పెట్టుకున్న ఆశల ను అడియాసలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కేటాయంపు విషయంలో కేంద్రంపై బలమైన నిరసన గళం వినిపించా లన్న చంద్రబాబు సూచనల మేరకు ఎంపీలు పార్లమెంట్ ఇంటా బయటా కేంద్రంపై దండెత్తారు.

02/06/2018 - 00:27

సంగారెడ్డి, ఫిబ్రవరి 5: క్షణం తీరిక లేని వ్యాపారమే అయినా సామాజికపరమైన సేవలో తనవంతు కృషి చేస్తూ అనేక అవార్డులు అందుకున్న అంతర్జాతీయ బంగారు నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్ సహా కేరళ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు సోమవారం సంగారెడ్డిలోని పురాతన జైలుకు తరలివచ్చారు. జైలులో ఒక రోజుండి ఆ అనుభూతిని పొందడానికి ఇక్కడికి వచ్చినట్లు బాబీ చెమ్మనూర్ తెలిపారు.

Pages