S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/02/2018 - 00:13

న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలోని వివిధ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు తమ సంస్థల మనుగడకు ఇకపై స్వయంప్రతిపత్తితో నిర్ణయం తీసుకోవడానికి కొత్తగా రూపొందే చట్టం దోహదం చేయనుంది. ఆయా సంస్థల్లో ఇపుడున్న డిప్లొమాలకు బదులుగా ఇకముందు డిగ్రీలను అందజేందుకు ఉద్దేశించిన ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజిమెంట్ బిల్ 2017’ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనకు వచ్చి చట్టంగా మారింది.

01/02/2018 - 00:12

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయ.
ఏ బండి ఆగినా.. బతుకు బండి ఆగదు.
అందుకే ఉదయానే్న కూలి పనికి బయలుదేరిన ఒక మహిళ.

01/01/2018 - 03:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నవభారత నిర్మాణంలో యువతే కీలకమని, వారు ఎన్నికల ప్రక్రియలో ఎంత క్రియాశీలకంగా పాల్గొంటే అంతగానూ ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తియుక్తులను సంతరించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఆ విధంగా భారత ప్రజాస్వామ్య పునాదులను పటిష్ఠం చేయాలని మోదీ అన్నారు.

01/01/2018 - 04:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దశాబ్దాల తర్వాత ముస్లిం మహిళలకు తలాక్.. తలాక్ సమస్య నుంచి విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముస్లిం మహిళల వైవాహిక జీవితాలను ఛిత్రం చేసే ఈ తలాక్ నుంచి వీరికి పూర్తి స్వేచ్ఛ లభించిందని మోదీ పేర్కొన్నారు.

01/01/2018 - 03:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దట్టమైన పొగమంచు ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 200కి పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మంచు కారణంగా 150కి పైగా విమానాలు ఆలస్యంగా ఇక్కడ నుండి బయలుదేరాయి. దాదాపు 50 విమానాలను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించగా, మరో 20 విమానాలను రద్దు చేశారు. ఆదివారం ఉదయం ఏడున్నర గంటల నుండి 11.05 నిమిషాల వరకు విమానాలు బయలుదేరిన జాడలేదు.

01/01/2018 - 03:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: మంత్రివర్గంలో శాఖల కేటాయింపుల్లో అవమానం జరిగిందంటూ అలకబూనిన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నిత్‌న్ పటేల్ ఎట్టకేలకు వౌనం వీడారు. ఆదివారంనాడు ఆయన తన కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆర్థిక శాఖను నితిన్ పటేల్‌కు ముఖ్యమంత్రి విజయ్ రూపాని తిరిగి కేటాయించారు.

01/01/2018 - 05:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం ఓ హడావుడి మాత్రమేనని అందులో ఎలాంటి పసా లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వ్యాఖ్యానించారు. పైగా రజినీకాంత్ నిరక్షరాస్యుడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

01/01/2018 - 03:43

అలహాబాద్, డిసెంబర్ 31: దేశంలో నకిలీ బాబాలు, వారి అఘాయిత్యాలు పేట్రేగుతున్న నేపథ్యంలో ఈ బూటకపు బాబాలకు సంబంధించిన సరికొత్త నివేదిక బహిర్గతమైంది. దేశంలో ఈ సాధువులకు సంబంధించిన అత్యున్నత సంస్థ 17 మంది కూడిన ఈ నకిలీ బాబాల జాబితాను వెల్లడించింది. వీరిలో నకిలీ బాబాలతోబాటు తమను తాముగా గాడ్‌మన్‌గా సంబోధించుకున్నవారు కూడా ఉన్నారని వెల్లడించింది.

01/01/2018 - 03:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రియమైన మోదీ భక్తులంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని చూచించారు.

01/01/2018 - 03:38

ఉత్తరాక్షి (ఉత్తరాఖండ్), డిసెంబర్ 31: కొత్త ఏడాది వేడుకలను హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం నెలాంగ్ లోయలో జరుపుకోబోతున్నారు. నెలాంగ్ లోయ పర్యటనకు వెళ్తున్న హోంమంత్రి చైనా బోర్డర్‌కు ఆనుకునివున్న ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ దళాలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటారని హోంమంత్రి శాఖ అధికారులు వెల్లడించారు.

Pages