S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/27/2017 - 02:50

లక్నో, డిసెంబర్ 26: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గత రెండు రోజుల్లో జరిగిన వివిధ సంఘటనల్లో ఐదుగురు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారు. బల్లియా జిల్లా సికందరపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ నెల 24న 14 ఏళ్ల బాలుడు ఐదేళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్ బాలుడిని పట్టుబడినట్టు జిల్లా ఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు.

12/27/2017 - 03:09

గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సీఎం గద్దెనెక్కే అవకాశం రూపానీకి రెండోసారి లభించింది.

12/27/2017 - 02:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత సైన్యం దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రజౌరీ సెక్టార్‌లోని సైనిక బంకర్లపై మెరుపుదాడి చేసింది. కొద్ది రోజుల క్రితం భారత బలగాలను దెబ్బతీసి నలుగురిని పొట్టన బెట్టుకున్న పాక్ సైనిక మూకలకు సర్జికల్ దాడులతో గట్టి గుణపాఠం నేర్పింది.

12/26/2017 - 03:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటక తదితర రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాజా వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది.

12/26/2017 - 02:39

సూరత్, డిసెంబర్ 25: సూరత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి మహేశ్ సవానీ తన సహృదయతను మరోసారి చాటుకున్నారు. తండ్రి లేని 251 మంది పేద యువతులకు ఆదివారం నాడు ఆయన అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. గత ఏడేళ్లుగా ఆయన నిరుపేద యువతులకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఐదుగురు ముస్లిం, ఒక క్రైస్తవ యువతి సహా మొత్తం 251 మందికి తన ఇంట్లో శుభకార్యం మాదిరి దగ్గరుండి వివాహాలు జరిపించారు.

12/26/2017 - 02:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం కల్పించడంలో కీలకపాత్ర పోషించినందుకు వాజపేయి జన్మదినాన్ని 2014 నుంచి మోదీ ప్రభుత్వం ‘సుపరిపాలన దినం’గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

12/26/2017 - 02:22

నోయిడా, డిసెంబర్ 25: నోయిడాను సందర్శించిన వారెవరూ అధికార పీఠంలో కొనసాగలేరన్నది కేవలం మూఢనమ్మకమేనని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ నిరూపించారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మూఢ విశ్వాసాలను బలంగా నమ్మేవారు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే హక్కు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

12/26/2017 - 02:18

కోజికోడ్, డిసెంబర్ 25: మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థుల కోసం ‘తహ్రీక్ ఇ తలీమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

12/26/2017 - 02:17

చెన్నై, డిసెంబర్ 25: ‘అతనొక అబద్ధాలకోరు, 420’ అంటూ ఆర్‌కె నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన టీటీవీ దినకర్‌న్‌పై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం విరుచుకుపడ్డారు. ‘దినకరన్ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలతోనే తానొక 420 అని రుజువు చేసుకున్నాడు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/26/2017 - 02:12

అహమ్మదాబాద్, డిసెంబర్ 25: విజయ్ రూపానీ నేతృత్వంలో గుజరాత్‌లో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతోంది. గాంధీనగర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రిగా రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మరికొందరు మంత్రుల చేత గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణం చేయిస్తారు.

Pages