S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/01/2017 - 03:22

న్యూఢిల్లీ, నవంబర్ 30: కాంగ్రెస్ నేత, మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోనీకి మెదడుకు సంబంధించిన శస్తచ్రికిత్స చేసేందుకు ఇక్కడి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. మెదడులో రక్తస్రావం కావడంతో ఆంటోనీని బుధవారం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలోని న్యూరోసర్జన్ల బృందం గురువారం సమావేశమై ఆంటోనీని శస్తచ్రికిత్స చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయనకు సంప్రదాయ విధానంలో వైద్యసహాయం అందిస్తున్నారు.

12/01/2017 - 03:20

దావణగెరె (కర్ణాటక), నవంబర్ 30: టీవీ సీరియల్‌లో చూసిన ‘ఫైర్ డ్యాన్స్’ను అనుకరిస్తూ నృత్యం చేయడానికి ప్రయత్నించిన ఓ ఏడేళ్ల బాలిక మంటలంటుకొని మృతి చెందింది. ఉత్తర కర్ణాటకలో జరిగిన ఈ విషాద ఉదంతం గురించి బాలిక తల్లిని ఉటంకిస్తూ పోలీసులు గురువారం తెలిపారు. ఈ నెల 11న రెండో తరగతి చదువుతున్న ప్రార్థన అనే బాలిక తన ఇంట్లోని ఒక గదిలో చెత్త కాగితాలను సేకరించి, ఒక చోట పోసింది.

12/01/2017 - 03:28

శ్రీనగర్, నవంబర్ 30: కాశ్మీర్‌లోని బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మిలిటెంట్లు మృతిచెందారు. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనగర్‌కు 45 కి.మీ దూరంలోని ఫుత్లిపోరాలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో తారసిల్లిన మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు మృతిచెందారు.

12/01/2017 - 01:51

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ సంక్షేమం, ప్రగతి కోసం రాజకీయంగా ఎంతటి మూల్యాన్నైనా చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యవస్థీకృత మార్పులను తీసుకొచ్చే విషయంలో ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధమని పేర్కొన్న ఆయన, తమ ప్రభుత్వం తిరుగులేని నిర్ణయాలనే తీసుకుంటూ వస్తోందని 15వ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిపక్ శిఖరాగ్ర సదస్సులో స్పష్టం చేశారు.

11/30/2017 - 03:21

మోర్బీ, నవంబర్ 29: వస్తు సేవల పన్ను (జిఎస్టీ) గబ్బర్ టాక్స్‌గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ అంతే తీవ్రతతో విరుచుకుపడ్డారు. దేశాన్ని దోచుకున్న వ్యక్తులు కేవలం బందిపోట్లు గురించే ఆలోచిస్తారని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.

11/30/2017 - 03:19

న్యూఢిల్లీ, నవంబర్ 29: వాతావరణంలో మార్పులకు భారత్ కారణం కాదని, నిజానికి ఆ విపరిణామాలతో సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ‘పారిస్ ఒప్పందం’ నుంచి కొన్ని దేశాలు వైదొలగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

11/30/2017 - 03:18

అహ్మద్‌నగర్, నవంబర్ 29: మహారాష్టల్రోని కోపార్డి గ్రామంలో గత ఏడాది పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసినందుకు ముగ్గురు నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్షను విధించింది. కోర్టు అదనపు స్పెషల్ జడ్డి సువర్ణా కెవలె ఈ మేరకు బుధవారం తీర్పును ప్రకటించారు.

11/30/2017 - 03:13

కోల్‌కతా, నవంబర్ 29: 20వ శతాబ్దపు ఆరంభంలో దేశ పారిశ్రామిక, ఉత్పాదక రంగాలకు మార్గదర్శిగా నిలిచిన పశ్చిమబెంగాల్, తన పాటవాన్ని మళ్లీ పొదివిపట్టుకోవడానికి ఇంకా మార్గాలు మూసుకుపోలేదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో వేళ్లూనుకుంటున్న డిజిటల్ టెక్నాలజీ రూపంలో రాష్ట్రానికి మరో అవకాశం కనిపిస్తోందని గుర్తు చేశారు.

11/30/2017 - 01:42

గోల్కొండ కోటపై వాలిన నెలవంకగా ఇవాంక మెరిసింది. అమెరికా శే్వతసౌధ సలహాదారు హోదాను కాసేపు పక్కనపెట్టి, శతాబ్దాల క్రితమే
అత్యద్భుతంగా నిర్మించిన గోల్కొండ కోట నిర్మాణ శైలిని పరిశీలించి అచ్చెరువొందారు. అక్కడి
విశేషాలను అడిగి తెలుసుకుంటూ, కోటలోని ముఖ్య భాగాలను పరిశీలించి ముచ్చట తీర్చుకున్నారు.

11/30/2017 - 01:35

న్యూఢిల్లీ, నవంబర్ 29: గుజరాత్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన గుజరాత్‌లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని బుధవారం సందర్శించినపుడు తాను హిందువును కాదంటూ అక్కడి రిజిస్టర్‌లో సంతకం చేశారు. అలా ఆయన సంతకం చేయడం ఇపుడు వివాదానికి కారణమైంది.

Pages