S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2017 - 03:13

అగర్తల, నవంబర్ 21: ఇక్కడి బోధ్‌జంగ్ నగర్‌లోని ‘త్రిపుర స్టేట్ రైఫిల్స్’ కార్యాలయంలో వాగ్యుద్ధానికి దిగాడని ఓ పాత్రికేయుడిని తపన్ దెబ్బర్మ అనే బాడీగార్డు కాల్చి చంపాడు. ‘స్యందన్ పత్రిక’కు చెందిన జర్నలిస్టు సుదీప్ దత్తా భౌమిక్ వార్తలను సేకరించేందుకు మంగళవారం ‘త్రిపుర స్టేట్ రైఫిల్స్’లోని సెకండ్ బెటాలియన్ కమాండంట్ కార్యాలయానికి వెళ్లాడు.

11/22/2017 - 03:12

రామేశ్వరం, నవంబర్ 21: కచ్చతీవు ద్వీపానికి సమీపంలో చేపలవేటకు వెళ్లిన సుమారు 1,700 మంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ సిబ్బంది వెంటాడిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో 75 బోట్లకు చెందిన వలలు ధ్వంసమైనట్లు తమిళనాడు మెకనైజ్డ్ బోట్ల యజమానుల సంఘం ఆరోపించింది. రామేశ్వరం ప్రాంతానికి చెందిన జాలర్లు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం చేపలవేటకు సముద్రంపైకి వెళ్లారు.

11/22/2017 - 03:10

న్యూఢిల్లీ, నవంబర్ 21: శౌర్య పతకాలు పొంది అమరులైన వారి భార్యలకు ఇస్తున్న భృతిపై నిబంధనలను తొలగించాలని రక్షణశాఖ నిర్ణయించింది. ‘శౌర్య’ అవార్డు గ్రహీత భార్య బయటి వ్యక్తిని పునర్వివాహం చేసుకున్న సందర్భంలో ఆమెకు భృతి చెల్లించరాదన్న నిబంధనలు ఇప్పటివరకూ అమలులో ఉన్నాయి. దివంగత భర్త సోదరుడిని వివాహం చేసుకున్న సందర్భంలోనే ఆమెకు భృతి చెల్లించాలన్న నిబంధనలను తొలగించాలని రక్షణశాఖ తాజాగా నిర్ణయించింది.

11/22/2017 - 03:10

మంగళవారం పాట్నాలో జరిగిన ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో కత్తి, నెత్తిమీద కిరీటంతో అలంకరిస్తున్న కార్యకర్తలు.

11/22/2017 - 03:08

మైసూరు, నవంబర్ 21: సంపాదనలో రూపాయి కూడా ఇతరులకు దానం చేసేందుకు ఎవరికీ మనసొప్పని నేటి ఆధునిక యుగంలో ఓ యాచకురాలు తన కష్టార్జితంలో రెండున్నర లక్షల రూపాయలను దైవానికి సమర్పించి తన పెద్దమనసును చాటుకుంది. ఒకప్పుడు అందరిలాగే పనిచేసుకుంటూ బతికిన ఆమెను అనుకోని రీతిలో విధి వెక్కిరించింది. ఓ చేయిని కోల్పోయినా, ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగ జీవించాలని భావించి ఆమె యాచకురాలిగా మారింది.

11/22/2017 - 01:47

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేందుకు సంబంధించిన చట్టాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇందుకు సంబంధించిన పనిని దాదాపుగా పూర్తి చేసిందని ఒక సీనియర్ మంత్రి వెల్లడించారు.

11/22/2017 - 01:35

న్యూఢిల్లీ, నవంబర్ 21: చారిత్రక చార్మినార్, తిరుమల ఆలయాన్ని స్వచ్ఛ ఐకాన్లుగా కేంద్రం గుర్తించింది. దేశవ్యాప్తంగా పది సాంప్రదాయక స్థలాలకు స్వచ్ఛ ఐకాన్లుగా గుర్తిస్తూ రెండో జాబితా విడుదల చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన రెండు రోజుల జాతీయ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

11/21/2017 - 03:13

న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతమైన ప్రజా విశ్వసనీయతను కలిగిన మూడో దేశంగా భారత్ అవతరించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అత్యంత నమ్మకమైన ప్రభుత్వంగా ప్రపంచ దేశాల్లోనే మూడోస్థానాన్ని అందుకుందని తాజాగా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఇసిడి) జరిపిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది.

11/21/2017 - 02:49

న్యూఢిల్లీ, నవంబర్ 20: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ సోమవారం కన్నుమూశారు. పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఎనిమిదేళ్లుగా కోమాలోనే ఉన్నారు. సమాచారం ప్రసార మంత్రిగా పనిచేసిన మున్షీకి 2008లో హార్ట్‌ఎటాక్ వచ్చింది. దీంతో పక్షవాతానికి గురై ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు.

11/21/2017 - 02:46

న్యూఢిల్లీ, నవంబర్ 20: పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతుల రూణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకేఎస్‌సీసీ) నేతృత్వంలో ‘కిసాన్ ముక్తి సంసద్’ పేరిట ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించింది.

Pages