S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/06/2017 - 02:57

చిత్రం..తన కుమార్తె మీసాతో కలిసి విచారణకు హాజరయ్యేందుకు గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి విచ్చేస్తున్న మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్

10/06/2017 - 02:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయం జవవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ మరోసారి వివాదం రాజుకుంది. నిత్యం వార్తల్లో ఉండే జెఎన్‌యులో ఈసారి వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ల మధ్య వివాదం తలెత్తింది. వైస్ చాన్సలర్ ఏకపక్ష నిర్ణయాలపై సీనియర్ ఆచార్యులు మండిపడుతున్నారు.

10/06/2017 - 02:55

చిత్రాలు.. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శ్రీనగర్‌లో ధర్నా చేస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలపై బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు...
*ధర్నాలో పాల్గొన్న ఓ వికలాంగ కార్యకర్తను నిర్దాక్షిణ్యంగా లాగిపారేస్తున్న దృశ్యం.

10/06/2017 - 02:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: హత్య, అత్యాచారం వంటి హేయమైన నేరాల విషయంలో బాధితులు రాజీపడ్డా అలాంటి నేరాలను కొట్టివేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హత్య, మానభంగం, దోపిడీ వంటివి వ్యక్తిగత నేరాలు కావని, వీటిని అరికట్టకపోతే సమాజంపైనే వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

10/06/2017 - 02:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పాకిస్తాన్ ఇంటర్-సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు భారత ఆర్మీపై విద్వేషం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. భారత ఆర్మీయే టార్గెట్‌గా ‘హలాల్ దస్తా’ అనే కొత్త ఉగ్రవాద గ్రూపు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రూపులో నిషేధిత లష్కరే తోయిబాకు చెందినవారే సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ వార్తా చానల్‌కు తెలిపాయి.

10/06/2017 - 02:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఢిల్లీలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఆరేళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. గత నెల గుర్‌గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషన్ స్కూలులో ఏడేళ్ల బాలుడు బస్సు కండక్టర్ చేతిలో అత్యాచార యత్నం-హత్యకు గురైన సంఘటనను మరువక ముందే ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరగడం కలకలం సృష్టిస్తోంది.

10/06/2017 - 02:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశవ్యాప్తంగా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సామర్థ్యం ఎన్నికల కమిషన్‌కు ఉందని, అయితే ఇందుకు సంబంధించి బలమైన వ్యవస్థాగత ఏర్పాట్లను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు.

10/06/2017 - 02:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కేంద్రం లక్షిత దాడులు చేయాలని నిర్ణయిస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానికి దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా ప్రకటించారు. చైనాను నిలవరించే శక్తి, సామర్థ్యాలు తమకు ఉన్నాయని గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. ద్విముఖ యుద్ధానికి భారత్ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ధనోవా పునరుద్ఘాటించారు.

10/06/2017 - 02:47

భువనేశ్వర్, అక్టోబర్ 5: ఒడిశాలో బిజూ జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం అసమర్థ పాలన సాగిస్తోందని భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధ్వజమెత్తారు. బిజెడి ప్రభుత్వం కేంద్ర పథకాలను దారిమళ్లించి ‘ఒక్క రూపాయికే కిలో బియ్యం’ పథకాన్ని ప్రవేశపెట్టి తన ఘనతగా చెప్పుకుంటోందని ఆయన ఆరోపించారు.

10/06/2017 - 02:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నుంచి పర్యావరణ, అటవీ తదితర అనుమతులు వచ్చేంతవరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Pages