S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/05/2017 - 21:16

ముంబయి, అక్టోబర్ 4: ఓ చిరు వ్యాపారి మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే పెను ప్రమాదం సంభవించిందని ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ స్టేషన్ ప్రమాదంపై విచారణ కమిటీ ముందు ఓ విద్యార్థిని వాంగ్మూలమిచ్చింది. సెప్టెంబర్ 29న ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట తలెత్తి 23మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రమాదంపై రైల్వే కమిటీ మంగళవారం నుంచీ విచారణ మొదలుపెట్టింది.

10/04/2017 - 23:33

కీచెరి (కేరళ), అక్టోబర్ 4: తుపాకులు ఎక్కుపెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన వాళ్ల రక్తంలోనే ఉందని వామపక్షాలపై ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. కేరళలో బిజెపి, ఆరెస్సెస్ కార్యకర్తల వరుస హత్యలను నిరసిస్తూ బిజెపి ‘జనరక్ష యాత్ర’ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

10/05/2017 - 21:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: భారత- చైనా దేశాల మధ్య సిక్కిం సెక్టార్‌లోని డోక్లాంలో మళ్లీ ఉద్రిక్తత నెలకొందా? అక్కడి ట్రైజంక్షన్‌లో మరోసారి చైనా సైనికులు రోడ్డు నిర్మాణానికి పూనుకోవడాన్ని భారత సైనికులు అడ్టుకుంటున్నారా? రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సాయంత్రం త్రివిధ దళాల అధిపతులతో అత్యవసర సమావేశం జరిపి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది.

10/05/2017 - 21:18

శ్రీనగర్, అక్టోబర్ 3: శ్రీనగర్‌లో ఉగ్ర దాడి ప్రయత్నాన్ని బిఎస్‌ఎఫ్ దళాలు తిప్పికొట్టాయి. పటిష్ట భద్రత కలిగిన శ్రీనగర్ విమానాశ్రయానికి దగ్గరలోని గోగోలాండ్ బిఎస్‌ఎఫ్ దళాల శిబిరంపై జైషే -ఇ -మహ్మద్ సంస్థ ఉగ్రవాదులు ముగ్గురు ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ బికె యాదవ్ మృతిచెందాడు.

10/05/2017 - 21:19

ఏలూరు, అక్టోబర్ 3: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదు, దేశానికీ ఎంతో అవసరమని కేంద్ర జలవనరుల మంత్రి నితీన్‌గడ్కరీ పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిచేసే విషయంలో సిఎం చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని, అందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అనుకున్న సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్రాక్ తరహాలో నిర్ణయాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

10/05/2017 - 21:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన పార్టీ నోటిఫికేషన్‌ను ఈనెల 10 తేదీనాడు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ జారీ చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారు ఈనెల 10 నుంచి తమ నామినేషన్లు దాఖలు చేయొచ్చు.

10/05/2017 - 21:21

భిలాస్‌పూర్, అక్టోబర్ 3: హిమాచల్‌ప్రదేశ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మోదీ ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ‘బెయిల్’పై ఉందని వ్యాఖ్యానించారు.

10/03/2017 - 23:20

పయ్యనూర్ (కేరళ), అక్టోబర్ 3: బిజెపి శ్రేణులే లక్ష్యంగా రాజకీయ హింసకు పాల్పడుతున్న సిపిఐ(ఎం) వైఖరిని నిరసిస్తూ అన్ని రాష్ట్రాల రాజధానుల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో రాజకీయ హింస పెరిగిందని షా ఆరోపించారు.

10/03/2017 - 03:48

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతి యావత్తూ బాపూజీకి ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోది.

10/03/2017 - 03:42

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమానికి గత పదిహేను రోజులుగా మంచి స్పందన లభిస్తోంది. సోమవారంతో ముగియనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Pages