S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/02/2017 - 02:49

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ముహూర్తం సిద్ధమైందట. దీపావళి తర్వాత ఎప్పుడైనా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చని రాహుల్ గాంధీకి సన్నిహితుడు, రాజస్థాన్‌కు చెందిన పార్టీ యువ నాయకుడు సచిన్ పైలట్ చెప్పారు. రాహుల్ గాంధీ ముందుండి పార్టీని నడిపించాల్సిన సమయం వచ్చిందని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.

10/02/2017 - 02:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్ ఆయురారోగ్యాలతో దేశసేవలో పాలుపంచుకోవాలని ప్రధాని ఆకాంక్షిచారు. రాష్టప్రతి పదివీ చేపట్టినప్పటి నుండి ఆయన సాధారణ స్వభావంతో ప్రజలకు దగ్గరయ్యారని ప్రధాని తెలిపారు.

10/02/2017 - 02:45

ముంబయి, అక్టోబర్ 1: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె ఆదివారం ‘మహారాష్ట్ర స్వాభిమాన్’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీ బిజెపితో కలిసి పనిచేస్తుందన్న సంకేతాలు కూడా ఏకకాలంలో అందించారు. రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతంలో విశేషమైన పలుకుబడి కలిగిన రాణె త్వరలోనే తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటానని వెల్లడించారు.

10/02/2017 - 02:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సుప్రీం కోర్టుతోసహా దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుతోందని కేంద్ర న్యాయ శాఖ ఒక జబితాను విడుదల చేసింది. అయితే దిగువ కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్యలోఎటువంటి మార్పు లేదని వెల్లడించింది.

10/02/2017 - 02:43

పాట్నా, అక్టోబర్ 1: అత్తవారింటికి వచ్చిన ఓ కోడలు ఆ ఇంట్లో బహిర్భూమి (టాయ్‌లెట్) లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురైంది. ఇదే విషయమై తన కుటుంబ సభ్యులకు, మామ, మరిదికి ఎన్నోసార్లు విన్నవించింది. ఆమె భర్త పనిమీద తమిళనాడు వెళ్లడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తిరిగి వచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇక చేసేది లేక తిన్నగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మామ, మరిదిపై కేసు పెట్టింది.

10/02/2017 - 02:42

చిత్రం..దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం వారణాసిలోని
నాతి ఇమ్లి వద్ద నిర్వహించిన భారత్ మిలాప్

10/02/2017 - 02:40

చిత్రం..మొహర్రం సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని జామా మసీదు నుంచి ఊరేగింపుగా బయలుదేరుతున్న ముస్లింలు

10/02/2017 - 02:38

జమ్మూ, అక్టోబర్ 1: సరిహద్దుల్లో 14 అడుగుల సొరంగ మార్గాన్ని కనుగొన్న బిఎస్‌ఎఫ్ బలగాలను జమ్మూ, కాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అభినందిస్తూ, సైనికంగా, రాజకీయంగా భారత్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన తర్వాత పాకిస్తాన్ మన దేశాన్ని అస్థిరం చేయడానికి శాయశక్తులా యత్నిస్తోందని అన్నారు.

10/02/2017 - 01:53

హైదరాబాద్, అక్టోబర్ 1: ఒడిశాలో సిపిఐ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్ధ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) జోనల్ కమిటీకి చెందిన ఏడుగురు సభ్యులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినట్లు డిజిపి ఆర్‌పి శర్మ తెలిపారు. అరెస్టయిన వారిలో కరణ్ సాయి, అర్జున్ రాణా తదితరులు ఉన్నారు. వారి వద్ద నుంచి నాలుగు ఆయుధాలు, ఎకె 47, 50 రౌండ్ల మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

10/02/2017 - 01:27

ఫరీదాబాద్, అక్టోబర్ 1: ప్రభుత్వానికి రాబడి పెరిగితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శ్లాబులను కుదించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచనప్రాయంగా వెల్లడించారు. ఫరీదాబాద్‌లో ఆదివారం ఎన్‌ఎసిఐఎన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘దేశంలో మూడు నెలల క్రితమే జిఎస్‌టి అమలు ప్రారంభమైంది.

Pages