S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/12/2017 - 02:21

సిర్సా, సెప్టెంబర్ 11: అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ మానవ రూపంలో ఉన్న కామ పిశాచా? సాధారణ పురుషుడి కన్నా అతని శారీరక కోర్కెలు నియంత్రించుకోలేని స్థితిలో ఉన్నాయా? అవుననే అంటున్నారు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు. రోహ్‌తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాను వైద్యులు పరీక్షించారు.

09/12/2017 - 02:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: డేరా బాబా సన్నిహితురాలు, దత్త పుత్రికగా చెప్పబడుతున్న హనీప్రీత్ ఇన్సాన్ నేపాల్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో సరిహద్దులో గాలింపును ముమ్మరం చేశారు. ఆమె చిత్రపటంతో కూడిన పోస్టర్లను పరిసరాల్లోని పోలీసు స్టేషన్లవద్ద అంటించారు. నేపాల్‌లోకి దొంగతనంగా ప్రవేశించే అవకాశముందన్న సమాచారం మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

09/12/2017 - 02:16

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: కుంభమేళా అన్నది భారతదేశ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వ చిహ్నమని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. సోమవారం నాడు కుంభమేళాపై ఇండస్ యూనివర్శిటీ స్కాలర్లు రూపొందించిన ప్రత్యేక చిత్రాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుంభమేళా చిత్ర ప్రోమోను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని ఆధ్యాత్మిక సమూహాల్లోకెల్లా కుంభమేళా అత్యంత పురాతనమైనదని పేర్కొన్నారు.

09/12/2017 - 02:12

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: గుర్‌గ్రామ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న హత్యపై కేంద్రానికి, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. తన కుమారుడి హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలని, ఇలాంటి కేసుల విచారణకు ఓ ట్రిబ్యునల్ లేదా అథారిటీని ఏర్పాటు చేయాలని అతడి తండ్రి వరుణ్ ఠాకూర్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

09/12/2017 - 01:36

గాంధీనగర్, సెప్టెంబర్ 11: గుజరాత్ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఆ రాష్ట్ర బిజెపి ఎన్నికల ఇన్‌చార్జి అరుణ్ జైట్లీ, సహ ఇన్‌చార్జి నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. ఈ విషయమై చర్చించేందుకు సోమవారం వారు రాష్ట్ర బిజెపి కోర్ గ్రూప్ సభ్యులతో భేటీ అయ్యారు.

09/12/2017 - 00:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: జాతీయ పెన్షన్ పథకం (ఎన్‌పిఎస్) చేరే వారి గరిష్ఠ వయో పరిమితిని 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ పెన్షన్ నిధుల నియంత్రణ, అభివృద్ధి అధారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మార్పులను ఆమోదించామని, త్వరలోనే అధికారకంగా ప్రకటిస్తామని చైర్మన్ హేమంత్ తెలిపారు.

09/12/2017 - 00:57

న్యూఢిల్లీ, సెస్టెంబర్ 11: పార్లమెంట్, శాసనసభ్యుల ఆస్తులు ఏటేటా పెరిగిపోతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఏడుగురు ఎంపీలు, 98మంది ఎమ్మెల్యేల స్థిరాస్తులు గణనీయంగా పెరిగిపోవటంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం సుప్రీం కోర్టుకు వెల్లడించింది.

09/12/2017 - 00:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రపంచం దృష్టిలో భారత్ ప్రతిష్ట, పలుకుబడి పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘దేశ ప్రజలు ఎదుగుతున్నారు. ప్రజాశక్తి పెరుగుతోంది. దీంతోపాటు దేశం పలుకుబడీ పెరుగుతోంది’ అన్నారు.

09/12/2017 - 00:39

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: సిమ్ కార్డులను ఆధార్‌తో సంధానం చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వీటిని ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే వాటిని పనిచేయకుండా చేస్తామని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశానుసారమే మొబైల్ ఫోన్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

09/11/2017 - 02:44

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశంలో మొట్టమొదటిసారి జడ్జీలుగా నియమించడానికి రాష్ట్ర హైకోర్టు కొలీజియంలు సిఫార్సు చేసిన అడ్వకేట్లు, జ్యుడీషియల్ అధికారుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య మరో వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది.

Pages