S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/11/2017 - 02:43

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ఉత్తరప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పండిట్ గోవింద్ వల్లభ్‌పంత్ దేశానికి ఎనలేని సేవ చేసారని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆదివారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ గోవింద్ వల్లభ్‌పంత్ జయంత్యుత్సవాలలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని పంత్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు.

09/11/2017 - 02:41

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను ఆంధ్రా, తెలంగాణ న్యాయవాదుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

09/11/2017 - 02:40

భువనేశ్వర్‌లో ఆదివారం నిర్మాణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయంది.
ఆ ప్రాంతంలో సహాయ చర్యలు చేపడుతున్న విపత్తు నివారణ సిబ్బంది

09/11/2017 - 02:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: హిమాచల్‌ప్రదేశ్ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విషమ పరీక్షను ఎదుర్కోనుంది. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజల్లో రోజు రోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత ఇందుకు ప్రధాన కారణం.

09/11/2017 - 02:36

అహ్మదాబాద్, సెప్టెంబర్ 10: గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్న నాయకులు క్రమంగా ఒక రాజకీయ పార్టీ వైపు ఒరిగిపోతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

09/11/2017 - 02:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మెరిసిపోయే కొత్త లగ్జరీ కారు కొన్న సంతోషంతో ఆ ఫోటోను ఒకవేళ ఫేస్‌బుఖ్‌లో పెట్టారంటే చాలు.. తెల్లవారేసరికి ఆదాయం పన్ను అధికారులు మీ ఇంటిముందు వాలి పోతారు జాగ్రత్త! నల్లధనం జాడ తెలుసుకోవడానికి ఆదాయం పన్ను శాఖ వచ్చేనెలనుంచి సోషల్ నెట్‌వర్క్‌లలోని వాస్తవ సమాచారాన్ని సైతం సేకరించడాన్ని ప్రారంభించబోతోంది.

09/11/2017 - 02:33

పనాజి,సెప్టెంబర్ 10: నౌకాదళానికి చెందిన ఆరుగురు మహిళా కాడెట్లు సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టి రావడానికి చేపట్టిన సాహస యాత్రకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గోవాలోని పనాజీ సమీపంలో ఉన్న ‘ఐఎన్‌ఎస్ మాండవి’ నౌకాదళ శిక్షణా స్థావరం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిస్థాయి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే నిర్మలా సీతారామన్ ఈ యాత్రను ప్రారంభించడం గమనార్హం.

09/11/2017 - 02:27

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అనూహ్య రీతిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను క్షణాల్లో మట్టుబెట్టి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధిచెప్పి ఏడాది పూర్తయింది. ప్రాణాంతకమైన ఆ లక్షిత దాడులు భారత కీర్తి పతాకను, సైనిక పాటవాన్ని ప్రపంచం నలుమూలలకు చాటాయి.

09/11/2017 - 02:17

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: దేశ రాజధానిలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యూ)లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతృత్వంలోని వామపక్ష ఐక్య కూటమి (ఎఐఎస్‌ఎఫ్, డీఎస్‌ఎఫ్) విజయం సాధించింది. జెఎన్‌యూఎస్‌ఐ అధ్యక్షురాలిగా గీతాకుమారి గెలుపొందారు. గీతాకుమారి 1506 ఓట్లు సాధించారు. ఇక ఉపాధ్యక్ష స్థానంలో సిమోన్ జోయాఖాన్ 1,873 ఓట్లు సాధించారు.

09/11/2017 - 02:11

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: పాకిస్తాన్, చైనాలు భారత్‌కు ఎంతమాత్రం ముప్పు కావని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ ఆదివారం స్పష్టం చేశారు. భారత్ చైనాల మధ్య డోక్లామ్ వివాదం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు సృష్టించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు ఈ సంఘర్షణకు స్వస్తి పలికినప్పటికీ ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Pages