S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/11/2017 - 02:08

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: దేశ రాజధానిలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యూ)లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) నేతృత్వంలోని వామపక్ష ఐక్య కూటమి (ఎఐఎస్‌ఎఫ్, డీఎస్‌ఎఫ్) విజయం సాధించింది. జెఎన్‌యూఎస్‌ఐ అధ్యక్షురాలిగా గీతాకుమారి గెలుపొందారు. గీతాకుమారి 1506 ఓట్లు సాధించారు. ఇక ఉపాధ్యక్ష స్థానంలో సిమోన్ జోయాఖాన్ 1,873 ఓట్లు సాధించారు.

09/11/2017 - 02:06

చెన్నై, సెప్టెంబర్ 10: తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి పళని స్వామిని బలపరీక్ష ఎదుర్కోవలసిందిగా ఆదేశించాలని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల బృందం ఆదివారం గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె నేత ఎం.కె.స్టాలిన్ సారథ్యంలో ఈ బృందం గవర్నర్‌ను కలుసుకుంది.

09/11/2017 - 01:49

బార్మర్, సెప్టెంబర్ 10:దేశ నలుదిశల్లో రక్షణను దుర్బేధ్యం చేస్తామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్ని వైపులా సైనిక సన్నద్ధతను పెంచడంతో పాటు గరిష్ఠ స్థాయిలో అప్రమత్తతకు పదును పెట్టడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. దేశ ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత చేకూరింది.

09/11/2017 - 01:33

అనంత్‌నాగ్ (జమ్మూ-కాశ్మీర్), సెప్టెంబర్ 10: కాశ్మీరు లోయలో శాంతిని నెలకొల్పడమే తమ లక్ష్యమని, ఈ విషయమై ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరితో చర్చించేందుకైనా తాను సిద్ధమేనని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.

09/11/2017 - 01:25

ప్రపంచ యాత్రకుభారత నారి శ్రీకారం చుట్టింది. దేశీయ నౌకలో ఏడాది పాటు లోకాన్ని చుట్టేందుకు సిద్ధమైంది. ఈ చారిత్రక మహిళా నావికుల సాహస యాత్రను భారత దేశ తొలి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పనాజీలో ప్రారంభించారు. ఇది ఐదేళ్లకో, పదేళ్లకో జరిగే యాత్ర కాదని, భారత మహిళా

09/10/2017 - 02:23

లక్నో, సెప్టెంబర్ 9: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాబల్యానికి, అధికార బిజెపికి పట్టుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఫూల్‌పూర్ స్థానానికి ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు.

09/10/2017 - 02:23

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి, పరిపుష్టి చేయడానికే కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ ఫిక్కీ సమావేశంలో ప్రసంగిస్తూ నల్లధనం అరికట్టడానికే కేంద్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలకు ప్రయోజం చేకూర్చాలన్న ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన సంస్కరణల్లో పెద్దనోట్ల రద్దు ఒకటని ఆయన పేర్కొన్నారు.

09/10/2017 - 02:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అంకుర్ బిందాల్ అనే యువకుడికి పట్టుమని 21 ఏళ్ల వయసు కూడా నిండకుండానే అన్ని దారులూ మూసుకుపోయాయి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని సంపాదించడం అంతకంటే కష్టంగా మారడం, అంకుర్ ప్రేమించిన వ్యక్తి అతనికి దూరమవడం ఇందుకు కారణం. దీంతో తీవ్రమైన నిరాశలో కొట్టుమిట్టాడుతున్న అంకుర్‌కు ఆత్మహత్య చేసుకోవడమే ఏకైక పరిష్కారమని అనిపించింది. కానీ అనుకున్నట్లుగా ఆత్మహత్య చేసుకోలేదు.

09/10/2017 - 02:20

సిర్సా, సెప్టెంబర్ 9: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలుకెళ్లిన డేరా సచ్ఛా సౌదా గుర్మిత్ రామ్ రహీం సింగ్ స్థావరాలపై శనివారం రెండోరోజూ విస్తృతంగా సోదాలు జరిగాయి. మహిళా భక్తురాళ్లకోసం నిర్మించిన హాస్టళ్లలో పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. డేరా ప్రాంతంలో జరిగిన సోదాల్లో ఓ బాణసంచా కర్మాగారం, పేలుడు పదార్థాలు కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు.

09/10/2017 - 02:18

రాంచి, సెప్టెంబర్ 9: దేశంలోని అన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా చేస్తే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఇది జరగాలంటే ప్రజలతో పాటుగా, దీనితో సంబంధం ఉన్న ఇతర భాగస్వాములు పాలు పంచుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. ‘దేశంలోని అన్ని నగరాలు స్మార్ట్ సిటీలుగా అయితే తప్ప ఏదో ఒక్క రాంచీయో, లేదా వంద స్మార్ట్ సిటీలో ఉంటే పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Pages