S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/09/2017 - 02:15

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య, డెంటల్ కళాశాలల్లో నీట్ పరీక్షల ద్వారానే ప్రవేశాలు నిర్వహించి తీరాలని సుప్రీం కోర్టు శుక్రవారం తమిళనాడు ప్రభుత్వానికి విస్పష్టంగా తెలిపింది. ఈ అంశంపై ఎలాంటి ఆందోళనలూ చెలరేగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

09/09/2017 - 02:14

డుంకా, సెప్టెంబర్ 8: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితుడితో షికారుకు వెళ్లిన ఓ గిరిజన బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌పి మయూర్ పటేల్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం గిరిజన బాలిక తన స్నేహితుడితో కలిసి యూనివర్శిటీ క్యాంపస్ వద్దకు వెళ్లింది.

09/09/2017 - 01:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీని పరుష పదాలతో విమర్శిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఓ పెద్ద వివాదానికి తెరదీశారు.మోదీని దుషణాభాషతో మొదట నిందించిన ఆయన మళ్లీ దానినే ట్వీట్ చేస్తూ వివాదాన్ని మరింత రగిలించారు. దీనిపై ఆగ్రహించిన బిజెపి నాయకత్వం దిగ్విజయ్ చర్యకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

09/09/2017 - 01:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పోలీసు సంస్కరణలపై 2006లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ దాఖలయిన పలు కోర్టు ధిక్కార పిటిషన్లను విచారించడానికి ఒక బెంచ్‌ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.

09/09/2017 - 01:36

న్యూఢిల్లీ/విజయవాడ, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యాభివృద్ధికి, వౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయనున్నదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చారు.

09/09/2017 - 01:08

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: విమాన ప్రయాణాల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించి గందరగోళం సృష్టించే వారిని మూడు కేటగిరీలుగా విభజించి, నేరాల స్థాయిని బట్టి వారిపై విధించే నిషేధ పరిమాణాన్ని స్పష్టంగా పేర్కొంటూ శుక్రవార ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విమాన సిబ్బందిని లేదా తోటి ప్రయాణికులను దూషిం చే వారిని, అనుచిత చేష్టలకు పాల్పడే వారిని మొదటి కేటగిరీలో చేర్చారు.

09/09/2017 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 8: అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) విధించడమా? రద్దు చేయడమా? లేక ప్రస్తుతమున్న పన్నుకు శ్లాబ్ ఖరారు చేయడమా? అనే అంశంపై కీలక నిర్ణయం నేడు వెలువడబోతుంది.

09/09/2017 - 01:02

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: సైన్యంలోని పోలీసు విభాగంలోకి మహిళలను తీసుకునేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం ఓ ప్రణాళికను సైన్యం ఖరారు చేసింది. ఆర్మీలోని పోలీసు విభాగంలోకి 800మంది మహిళలను చేర్చుకోవాలని అనుకుంటున్నామని, ఏడాదికి 52మంది చొప్పున చేర్చుకుంటామని ఆర్మీ లెఫ్టెనెంట్ జనరల్ అశ్వినీ కుమార్ శుక్రవారం వెల్లడించారు. సైన్యంలో లింగ వివక్ష తొలగించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని కూడా ఆయన అన్నారు.

09/09/2017 - 01:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధరలు తారాస్థాయికి దూసుకెళ్లాయి. పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ఒకేసారి 990 రూపాయలు పెరిగి 31,350 రూపాయలకు చేరుకుంది. గత పది నెలల్లో ఇదే అత్యధిక స్థాయి పెరుగుదల. గత రెండు రోజుల్లో 240 రూపాయలు తగ్గిన బంగారం ధర తాజాగా స్థానిక నగల వర్తకుల నుంచి కొనుగోళ్లు భారీగా పెరగడంతో 10 నెలల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది.

09/08/2017 - 03:10

చిత్రం..ఢిల్లీలో గురువారం రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌

Pages