S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/06/2017 - 02:43

అలహాబాద్, సెప్టెంబర్ 5: దేశ భద్రత, రక్షణ విషయంలో తాము ఎవరికీ భయపడేది లేదని భారత్ ప్రపంచానికి చాటి చెప్పిందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం చెప్పారు. అంతేకాదు, ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠను మోదీ ప్రభుత్వం పెంచిందని ఆయన ప్రశంసించారు. డోక్లాంలో రెండు నెలలకు పైగా భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ఇరుదేశాలు పరస్పరం పరిష్కరించుకొన్న నేపథ్యంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

09/06/2017 - 02:34

చెన్నై, సెప్టెంబర్ 5: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె పళనిస్వామి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నాడిఎంకె లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ఆ పార్టీకి చెందిన 111 మంది పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

09/06/2017 - 02:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఎంపి మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్‌కు చెందిన ఫామ్ హౌస్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దక్షిణ ఢిల్లాలోని బిజ్‌వాసన్ ప్రాంతంలో ఉన్న ఈ ఫాంహౌస్‌ను 2008-09లో 1.2కోట్లతో కొన్నారని, ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగిందని ఈడీ ఆరోపించింది.

09/06/2017 - 02:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఈశాన్య భారత్‌లో ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో పనులను తమ ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు.

09/06/2017 - 02:26

శ్రీనగర్, సెప్టెంబర్ 5: జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఎఎస్‌ఐ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రా (5)ను అన్ని విధాలా ఆదుకోడానికి క్రికెటర్ గౌతం గంబీర్ ముందుకొచ్చాడు. గత నెలలో అనంత్‌నాగ్ చౌక్‌లో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఆమె తండ్రి చనిపోయారు. తండ్రి శవపేటిక వద్ద చిన్నారి జోహ్రా రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.

09/06/2017 - 02:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మంత్రులుగానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు గానీ న్యాయసలహాకోసం తన వద్దకు రావద్దనని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు అవసరమైన పక్షంలో న్యాయశాఖ ద్వారా తన కార్యాలయాన్ని సంప్రదించాలని మంగళవారం ఇక్కడ విజ్ఞప్తి చేశారు. పలు అంశాలపై న్యాయ సలహా కోరుతూ మంత్రుల కార్యదర్శులు సరాసరి అటార్నీ జనరల్‌ను ఆశ్రయిస్తు నేపథ్యంలో ఈ మేరకు లేఖలు రాశారు.

09/06/2017 - 02:01

ముంబయి, సెప్టెంబర్ 5: మహారాష్టల్రో మంగళవారం జరిగిన వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన అపశ్రుతుల్లో 11మంది మరణించారు. దాదాపు అన్ని చోట్లా వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు వేల సంఖ్యలోనే భక్తులు తరలివచ్చారు. ఔరంగాబాద్ జిల్లాలోని బిడ్కిన్ సమీపంలోని శివనాయక్ సరస్సులో మునిగి ముగ్గురు దుర్మరణం చెందారు.

09/06/2017 - 01:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులిచ్చింది. చెన్నమనేని భారత పౌరసత్వం చెల్లదని, దీనికి సంబంధించిన వివరాలతో కూడిన లేఖను కేంద్రహోం మంత్రిత్వశాఖ కార్యలయం ఎమ్మెల్యే చెన్నమనేనికి పంపించినట్టు తెలిసింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వన్ని సవాల్ చేస్తూ బిజెపి నాయకుడు ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టులో పోరాటం చేయటం తెలిసిందే.

09/06/2017 - 01:34

బెంగళూరు, సెప్టెంబర్ 5:సీనియర్ జర్నలిస్టు, లంకేశ్ పత్రిక అనే వార పత్రిక ప్రధాన సంపాదకురాలు గౌరీ లంకేశ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని రాజేశ్వరీ నగరంలో ఆమె ఇంటి వద్దనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమగ్ర దర్యాప్తు జరిపించాలని పోలీసులను ఆదేశించారు.

09/06/2017 - 01:27

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 5:్భరత దేశం ప్రాధాన్యతను ఆమోదించేందుకు చైనా సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల తరువాత మరోసారి పంచశీల సూత్రాల గురించి చైనా మాట్లాడింది. పంచశీల సిద్ధాంతాల మేరకు భారత దేశంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెప్పడం జీజింపింగ్ చెప్పటం ఈ మార్పులకు నిదర్శమని అంటున్నారు.

Pages