S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/06/2016 - 13:23

న్యూఢిల్లీ, మే 5: ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను అదుపుచేసేందుకు ఉద్దేశించిన ‘ది క్లీనికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజిష్ట్రైషన్ అండ్ రెగ్యులేషన్ ) 2010 చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు. ఖాన్ గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న దోపిడీ గురించి ప్రస్తావించారు.

05/06/2016 - 12:18

దిల్లీ: నగరంలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం ఉదయం ధర్నా జరిపిన అనంతరం పార్లమెంటు భవనంవైపు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, పార్టీ యువనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితర ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళుతూ నిబంధనలను అతిక్రమించారని పోలీసులు కాంగ్రెస్ నేతలకు చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

05/06/2016 - 12:17

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల పరిధిలో గురువారం రాత్రి 11-30 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి,ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.1గా నమోదైంది.

05/06/2016 - 12:17

దిల్లీ: కేంద్రంలో ఎన్‌డిఎ సర్కారు ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ప్రభుత్వాలను అనైతిక పద్ధతుల్లో కూల్చివేసి కేంద్రం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.

05/06/2016 - 06:20

హైదరాబాద్, మే 5: ఈ మధ్య ఎక్కడ విన్నా ‘నీట్’ మాటే! దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించడం మంచిదా కాదా అన్న దానిపై చర్చోపచర్చలు. సుప్రీంలో పిటిషన్ల మీద పిటిషన్లు..! నీట్‌ను నిర్వహించలేమని వాదిస్తున్న రాష్ట్రాల సంఖ్య చాలా తక్కువ కావడం గమనార్హం. జాతీయ స్థాయి జరిగే ఈ పరీక్షను వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగించేదే!

05/06/2016 - 06:16

పెరుందురై, మే 5: వరుసగా రెండోసారీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అధికార అన్నాడిఎంకె అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గురువారం హద్దుల్లేని వరాల వర్షమే కురిపించారు. మరో పదిరోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేసిన జయ వరాల మూటనే వెదజల్లారు.

05/06/2016 - 06:09

న్యూఢిల్లీ, మే 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు. ఉమాభారతి గురువారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు.

05/06/2016 - 06:06

న్యూఢిల్లీ, మే 5: విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేయగలిగినంత సాయం చేస్తుందని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతి పైసా అలాగే పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ నుంచి రుణం ఇప్పిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో 2015-16 బడ్జెట్‌పై జరిగిన చర్చకు బదులిస్తూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు.

05/06/2016 - 05:59

భద్రాచలం, మే 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఆ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా దల్దోవా ఘాట్‌లో బైకును తప్పించబోయి మహేంద్ర ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా 14 మంది సంఘటన స్థలంలోనే చనిపోయారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉంది.

05/06/2016 - 05:12

నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఒక గిరిజన ఉత్సవంలో పాల్గొన్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్‌ను స్థానికులు ఇలా అలంకరించారు.

Pages