S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/02/2017 - 02:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అధికారాన్ని పూర్తిగా గుప్పిట పట్టాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఏకైక లక్ష్యమని, దీనివల్ల కేబినెట్ తరహా పాలనా విధానమే నీరుగారిపోయిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్వరంతో విమర్శలు గుప్పించింది. ఆదివారం మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్న తరుణంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది.

09/02/2017 - 02:17

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాజకీయంగా అత్యంత సున్నితమైన బోఫోర్స్ కుంభకోణం కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యవహారంపై ఐరోపాలో ఉంటున్న భారతీయ సంతతి పారిశ్రామికవేత్తలు హిందుజా సోదరులపై వచ్చిన అనియోగాలను కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బిజెపి నాయకుడు అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసుకొన్న పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.

09/02/2017 - 01:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర శుక్రవారం ఏడు రూపాయలు పెరిగింది. ఈ ఆర్థక సంవత్సరం చివరి నాటికి మొత్తం సబ్సిడీలను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి నెలా సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధరలను కొద్దికొద్దిగా పెంచుతున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా శుక్రవారం ఈ సిలిండర్ ధరను 7 రూపాయలు పెంచారు.

09/02/2017 - 01:13

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: విశాఖ జిల్లా వాకపల్లి మహిళల అత్యాచారం కేసు విచారణపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసు విచారణ ఇనే్నళ్లు సాగితే న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోతుందని అత్యున్నత దర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని కింది కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

09/02/2017 - 01:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ రంగం సిద్ధం చేశారు. 2019 ఎన్నికలను టార్గెట్ చేస్తూ జరుగుతోన్న విస్తరణ కావడంతో పదినుంచి పదిహేను మంది మంత్రులను మార్చి కొత్తవారికి స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. జెడి (యు), అన్నాడిఎంకెలకు కేబినెట్‌లో స్థానం కల్పిస్తున్నారు.

09/01/2017 - 02:59

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతోపాటు పలు అంతర్జాతీయ సమస్యలపై కలిసి పనిచేయాలని భారత్-స్విట్జర్లాండ్‌లు నిర్ణయించాయి. భారత్‌లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం స్విస్ అధ్యక్షురాలు డోరిస్ లెథర్డ్ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పన్నుల ఎగవేత, నల్లధనం నిర్మూలనకు భారత్ తీసుకున్న చర్యలు ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతల మద్య చర్చకు వచ్చింది.

09/01/2017 - 02:57

న్యూఢిల్లీ, ఆగస్టు 31: తమిళనాడు రాజకీయా లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రతిపక్షాల నేతలు బుధవారం రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావును కలిసి సిఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్ష నిర్వహించాలని కోరిన విషయం తెలిసిందే. సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి చెప్పారు.

09/01/2017 - 02:55

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రానున్న గుజరాత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపి అధినాయకత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సీనియర్ మంత్రి అరుణ్‌జైట్లీతోపాటు పలువురితో చర్చించారు.

09/01/2017 - 02:52

చిత్రం..ఢిల్లీలోని ఆజాద్‌పూర్ సబ్జిమండిని గురువారం సందర్శించిన ఆస్ట్రేలియా మంత్రి స్టీవెన్ కోయబో

09/01/2017 - 02:50

న్యూఢిల్లీ, ఆగస్టు 31:డేరాబాబా గుర్మీత్‌సింగ్‌కు సం బంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగుచూసింది. జంట అత్యాచారాల కేసులో 20 ఏల్ల జైలుశిక్షకు గురైన ఆయన పేరును 2017 పద్మా అవార్డుల కోసం ఏకంగా 4,208 మంది సిఫార్సు చేశారు.

Pages