S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/31/2016 - 18:05

హైదరాబాద్: నేపాల్‌లో చిక్కుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన 60 మంది యాత్రీకులు క్షేమంగా ఉన్నారని, వారిని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. వీరిని తీసుకువెళ్లిన ట్రావెల్ సంస్థ నేపాల్‌లో వదిలేసినట్లు ఆయన చెప్పారు.

05/31/2016 - 16:13

హైదరాబాద్: ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు సీట్లకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లే. పోలింగ్ అవసరం లేకుండానే ఎన్నికల ఘట్టానికి తెర పడనుంది. తెలంగాణలో రెండు సీట్లకు తెరాస నుంచి డిఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్లు వేశారు. వేరెవరూ నామినేషన్లు వేయనందున ఈ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే.

05/31/2016 - 15:58

దిల్లీ: బ్రిటిష్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై కేసులను త్వరితగతిన విచారించాలని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఇప్పటికే వాద్రా లండన్‌లో భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడని, ఆయుధ డీలర్ సంజయ్ భండారీపై ఆదాయపు పన్నుశాఖ అధికారుల దాడుల్లో సోనియా అల్లుడి అక్రమాల గురించి ఆధారాలు లభించాయని పేర్కొన్నారు.

05/31/2016 - 15:57

దిల్లీ: దేశ రాజధానిలో విద్యుత్, మంచినీటి సరఫరా తీరు అధ్వాన్నంగా ఉండడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారని ఆరోపిస్తూ దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద మంగళవారం నాడు బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించి చెదరగొట్టారు.

05/31/2016 - 15:56

లక్నో: తన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలుంటే విచారణ జరిపి నిజాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అంటే సోనియా కుటుంబాన్ని వేధించడం కాదని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

05/31/2016 - 13:28

దిల్లీ: చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌కే ధోవన్‌ పదవికాలం పూర్తవడంతో నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. భారత నావికాదళానికి ఆయన 21వ అధిపతి. 58 ఏళ్ల లంబా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

05/31/2016 - 07:10

న్యూఢిల్లీ, మే 30: పవిత్ర గంగాజలం కూడా ఈ కామర్స్ రూటు పడుతోంది. మార్కెట్‌కు వెళ్లకుండానే మొబైల్ ఫోన్లు, చీరలు, దుస్తులు, ఆభరణాలే ఈ కామర్స్ ద్వారా వినియోగదారుల ఇళ్లకు ఎలా చేరుతున్నాయో.. కాశీ మహాక్షేత్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పవిత్ర గంగాజలం కూడా ఇళ్లకు చేరుకునే తరుణం ఆసన్నమైంది. దేశం నలుచెరగులా విస్తరించిన పోస్ట్ఫాసు నెట్‌వర్క్‌నే ఇందుకు కేంద్రం వినియోగించుకోబోతోంది.

05/31/2016 - 07:03

న్యూఢిల్లీ, మే 30: కొలీజియం వ్యవహారం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మధ్య సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందా? జాతీయ ప్రయోజనాల పేరుతో తమ సిఫార్సులను తిరస్కరించేందుకు ప్రభుత్వానికి గల హక్కును సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

05/31/2016 - 06:31

బాగ్దాద్, మే 30: ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గల వాణిజ్య స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోమవారం జరిపిన బాంబు దాడుల్లో 24 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లో షియాల ప్రాబల్యం గల ఒక వాణిజ్య ప్రాంతంలోని ఒక చెక్‌పాయింట్‌లోకి ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన కారుతో దూసుకెళ్లాడు.

05/31/2016 - 06:31

న్యూఢిల్లీ, మే 30: ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక హోదానుండి తప్పించుకునేందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు రాజస్తాన్‌కు పారిపోయారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఆదివారం జరిగిన సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన నారాయణ సోమవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు.

Pages