S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/23/2016 - 00:42

న్యూఢిల్లీ, జనవరి 22: హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం నిర్ణయించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వివక్షతను కఠినంగా అరికట్టేందుకు మనవ వనరుల శాఖ పలు నిర్ణయాలను ప్రకటించింది.

01/22/2016 - 16:45

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘా బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్,బెంగళూరు, చండీగఢ్, కోల్‌కత తదితర నగరాల్లో సోదాలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో కొందరిని అరెస్టు చేశారు.

01/22/2016 - 16:45

లక్నో: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, రోహిత్ తల్లిని ఓదార్చవలసిన సమయం ఇది అన్నారు. రోహిత్ మృతితో దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు.

01/22/2016 - 12:11

దిల్లీ: దిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టడంతో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్లపై వాహనాలే కాక రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. దిల్లీ ఎయిర్‌పోర్టులో 11 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.

01/22/2016 - 12:11

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీని వారణాసిలో కలిసేందుకు వికలాంగులు ఓ బస్సులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపక్క విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారణాసి పర్యటనలో మోదీని కలిసేందుకు వీరంతా బస్సులో బయలుదేరారు.

01/22/2016 - 12:10

ముంబై: రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై గురువారం అర్ధరాత్రి కారు దూసుకుపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కారును సంఘటన స్థలంలో వదిలేసి వెళ్లిన డ్రైవర్‌ను కొద్ది గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

01/22/2016 - 02:08

న్యూఢిల్లీ, జనవరి 21: తెలంగాణకు సంబంధించిన పలు పథకాలను రానున్న రైల్వే బడ్జెట్‌లో చేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఆనంద్ భాస్కర్ గురువారం సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. స్టేషన్ ఘనపుర్-సూర్యాపేట్ రైల్వే లైను నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించాలన్నారు.

01/22/2016 - 02:07

న్యూఢిల్లీ, జనవరి 21: విజయవాడ-విశాఖపట్నం నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర పౌన విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరారు. అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం రైల్ భవన్‌లో సురేష్ ప్రభును కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

01/22/2016 - 01:46

న్యూఢిల్లీ/అమృత్‌సర్, జనవరి 21: పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కేసుకు సంబంధించి పంజాబ్ పోలీస్ ఎస్‌పి సల్వీందర్ సింగ్ నివాసాల్లో ఎన్‌ఐఏ గురువారం సోదాలు జరిపింది. ఐదుచోట్ల జరిపిన ఈ సోదాల్లో సల్వీందర్‌సింగ్, ఆయన స్నేహితులు, వంటమనిషి నివాసాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది.

01/22/2016 - 01:44

న్యూఢిల్లీ, జనవరి 21: అత్యహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ స్మృతీ ఇరానీ మూడు అబద్దాలు చెప్పారని అన్నారు.

Pages