S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/02/2016 - 06:48

న్యూఢిల్లీ, మే 1: కార్మికులు లేకుండా పురోగతి సాధించలేమని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురష్కరించుకొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘‘శ్రమయేవ జయతే’’ నినాదం ద్యారా ప్రతి కార్మికుడికి న్యాయబద్ధమైన వ్యవస్థను సృష్టిస్తూ ఉత్తమ అవకాశాలను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

05/02/2016 - 06:00

ఒబామా అందగాడు.. చతురుడు! వైట్‌హౌస్‌లో అరుదైన విందుకు హాజరైన అనంతరం బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
వ్యాఖ్యలివి..ప్రపంచ ప్రముఖులెందరో హాజరైన ఈ విందులో ఒబామా దంపతులతో ప్రియాంక ఛాయాచిత్రమిది.

05/02/2016 - 06:01

సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ-బోట్‌ను ఆదివారం వారణాసిలో ప్రారంభించిన ప్రధాని మోదీ అందులోనే ప్రయాణిస్తున్న దృశ్యం

05/02/2016 - 05:55

సిమ్లా/ డెహ్రాడూన్, మే 1: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న దావానలం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌ను అంటుకుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో అడవులు తగుల బడటంతో వేలాది హెక్టార్లు నాశనం కావడంతో..ఆ మంటలను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇప్పటికే హిమాచల్ రాజధాని సిమ్లాలో 50వేల హెక్టార్ల అటవీ భూమి అంటుకు పోయింది.

05/01/2016 - 16:30

వారణాసి:దాదాపు 5కోట్ల మంది పేద మహిళలకు ఉపయోగపడే కొత్త పధకం ప్రధానమంత్రి ఉజ్వలయోజనను ప్రధాని నరేంద్రమోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలెండర్లు పంపిణీ చేశారు. ఈ పథకం వల్ల పేదలకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయన అన్నారు.

05/01/2016 - 16:29

వారణాసి:కార్మికుల శ్రమవల్లే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందని, తానుకూడా ఒక కార్మికుడినేనని, దేశంలో నెంబర్ వన్ కూలీని తానేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బనాలీ గ్రామంలో జరిగిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

05/01/2016 - 16:28

న్యూదిల్లి:అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ వ్యవహారంపై 4న పార్లమెంటులో గుట్టు విప్పుతానని రక్షణమంత్రి మనోహర్ పారికర్ మీడియాకు చెప్పారు. ఆ ఒప్పందానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లను సభముందుంచుతానని స్పష్టం చేశారు. యుపిఎ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఇప్పటికే పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.

05/01/2016 - 06:24

తిరువనంతపురం, ఏప్రిల్ 30: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంపై అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీపై దాడిని మరింత తీవ్రం చేసింది. యుపిఏ హయాంలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అయితే ఎన్డీఏ దాన్ని ఎత్తివేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ‘ఊహాజనితమైన కట్టుకథ’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

05/01/2016 - 06:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పార్లమెంటులో, శాసన సభల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కొత్త చట్టాలను చేసేటప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు.

05/01/2016 - 06:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఫ్లాట్ కొనుగోలుదారులు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తోంది. కార్యాచరణ నియమాలు, నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు, పునర్వివిచారణ న్యాయ స్థానాలు (అప్పెల్లెట్ ట్రిబ్యునల్స్) పని మే 1నుంచి ప్రారంభం అవుతాయని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ శనివారం ప్రకటించింది.

Pages