S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/30/2017 - 01:59

న్యూఢిల్లీ, ఆగస్టు 29:్భర్య అంగీకారం లేకుండా జరిగే వైవాహిక సంపర్కాన్ని మానభంగంగా పరిగణించి శిక్షార్హ నేరంగా ప్రకటిస్తే పురుషులు మరింతగా భార్యల వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది.

08/30/2017 - 02:54

ముంబయి, ఆగస్టు 29: దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరం వర్షాలు, వరదలతో తల్లడిల్లిపోతోంది. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కొన్ని సర్వీసులను రద్దుచేశారు. రహదారులపై నీరు ప్రవహించడంతో వేలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా దాదాపుఅన్ని చోట్లా ఎవరూ ఎక్కడికి కదలేని పరిస్థితి నెలకొంది.

08/30/2017 - 01:34

ఉదయ్‌పూర్ (రాజస్తాన్), ఆగస్టు 29: తమ ప్రభుత్వం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని నిబద్ధతతో అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాకం కారణంగా మొత్తం వ్యవస్థే చతికిల పడిందని మంగళవారం ఖేల్‌కావ్‌లో జరిగిన భారీ ర్యాలీలో అన్నారు. మూడేళ్ల క్రితం ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తం వ్యవస్థే కుంటుపడిపోయిన స్థితిలో ఉందని గుర్తు చేశారు.

08/30/2017 - 01:09

అంతర్జాతీయ బాడ్మింటన్ మ్యాచ్‌లలో పోటీ మరింత తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘమైన ర్యాలీలతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయ. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి బాడ్మింటన్ మ్యాచ్‌లు అంత సులభంగా లేవు. పురుషుల సింగిల్స్, డబుల్స్ సహా అన్ని విభాగాల మ్యాచ్‌లూ సుదీర్ఘమైన ర్యాలీలు హోరాహోరీగా సాగుతున్నాయ. ప్రతిభతోపాటు క్రీడాకారుల మధ్య పోటీ విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

08/29/2017 - 23:06

న్యూఢిల్లీ,ఆగస్టు 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై ఈ సెప్టెంబర్ 4లోగా సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశించింది.

08/29/2017 - 02:43

హైదరాబాద్, ఆగస్టు 28: గీతం ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఇ విద్యార్థిని మానస జొన్నలగడ్డ మిస్ అండ్ మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ -2017 టైటిల్ విజేతగా నిలిచినట్టు గీతం వర్శిటీ ప్రొ వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ చెప్పారు.

08/29/2017 - 02:25

న్యూఢిల్లీ, ఆగస్టు 28: చైనాలో సెప్టెంబర్ మూడు నుండి జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బాయికాట్ చేసేందుకు సిద్ధపడినందుకే డోక్లామ్ నుండి తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు చైనా అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా సభ్యులుగా ఉన్న బ్రిక్స్ దేశాల అధినాయకుల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ మూడు నుండి మూడు రోజులపాటు జరుగుతుంది.

08/29/2017 - 02:25

న్యూఢిల్లీ, ఆగస్టు 28: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు కేసు విచారణను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు సోమవారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

08/29/2017 - 02:24

లక్నో, ఆగస్టు 28: మతం పేరుతో హింసను సహించేది లేదని, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను బిఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేస్తూ డేరా సచ్చాసౌదా అనుయాయులు హింసాకాండకు పాల్పడిన తర్వాత హర్యానా ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు.

08/29/2017 - 02:24

చండీగఢ్, ఆగస్టు 28: పదిహేనేళ్ల నాటి జంట మానభంగాల కేసులో డేరా సచ్చా అధినేత గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన వారసుడిగా కొడుకు జస్మీత్ ఇన్సాన్ నియమితులయ్యారు. గుర్మీత్ వారసుడెవరన్న దానిపై సోమవారం విస్తృత స్థాయిలో ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆయన తల్లి నసీబ్ కౌర్ ఈ నిర్ణయం ప్రకటించారు. గుర్మీత్ కుమారుడు, తన మనవడైన ఇన్సాన్‌కు ఈ పదవి కట్టబెట్టారు.

Pages