S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/28/2017 - 02:06

చండీగఢ్, ఆగస్టు 27: హైకోర్టు ఆదేశాల మేరకు డేరా సచ్చా సౌదా బాబాకు చెందిన స్థిర, చరాస్తులను గుర్తించడం ప్రారంభించినట్లు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆదివారం చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన రెవిన్యూ అధికారులు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు చెందిన డేరా ఆస్తుల వివరాల జాబితాను తయారు చేస్తున్నారు. డేరా ఖాతాలకు చెందిన వివరాలను తెలియజేయాలని బ్యాంకులను కూడా కోరినట్లు వారు చెప్పారు.

08/28/2017 - 02:05

న్యూఢిల్లీ, ఆగస్టు 27: అమెరిగా అధ్యక్ష పీఠాన్ని ఏదో ఒకరోజు తెలుగు వ్యక్తి అధిరోహిస్తారని మాజీ ఎంపీ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా డెట్రాయిట్ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవ సదర్భంగా శనివారం ఏర్పాటుచేసిన సభలో యార్లగడ్డ ప్రసంగించారు.

08/28/2017 - 02:05

న్యూఢిల్లీ, ఆగస్టు 27: అన్నాడిఎంకె త్వరలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో చేరుతుందని బిజెపి సీనియర్ నాయకుడొకరు చెప్పారు. ‘అన్నా డిఎంకె తప్పకుండా ఎన్డీఏలో చేరుతుంది. దీనికి సంబంధించి ప్రకటన వెలువడ్డమే తరువాయి. అన్నాడిఎంకె ఎప్పుడైతే ఎన్డీఏలో చేరుతుందో అప్పుడు సహజంగానే ఆ పార్టీ ప్రభుత్వంలో కూడా చేరుతుంది’ అని ఆ నేత చెప్పారు.

08/28/2017 - 02:04

చెన్నై, ఆగస్టు 27: తమిళనాడులోని అధికార అన్నా డిఎంకె ఎమ్మెల్యేల్లో ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసినందున శాసనసభలో ముఖ్యమంత్రి కె.పళనిస్వామి మెజార్టీని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. డిఎంకె నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం ఆదివారం తమిళనాడు గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావును కలసి ఈ మేరకు పళనిస్వామిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.

08/28/2017 - 01:59

సిర్సా, ఆగస్టు 27: ఓ పక్క పట్టణమంతా కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ సిర్సా ప్రజలు అన్నార్తుల ఆకలి తీర్చడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తూ దాతృత్వ గుణాన్ని చాటుకుంటున్నారు. సిర్సాలోని డేరా సచ్చాసౌదా ప్రధాన కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందికి అల్పాహారం, టీ అందించడానికి పట్టణంలోని కొంతమంది సేవా తత్పరులు ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేస్తున్నారు.

08/28/2017 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 27: జన్‌ధన్, ఆధార్, మొబైల్ సర్వీసులు.. దేశంలో ఈ మూడు అంశాలు ఒక సామాజిక విప్లవానే్న తీసుకు వస్తున్నాయని, వస్తు సేవల పన్ను దేశమంతా ఒకే మార్కెట్‌ను ఎలా సృష్టించిందో ఈ మూడు అంశాలు కూడా భారతీయులందరినీ ఒకే ఉమ్మడి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు వస్తాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘దేశం ఇప్పుడు మూడు అంశాల్లో వందకోట్ల దరిదాపులకు చేరుకొంది.

08/28/2017 - 01:23

న్యూఢిల్లీ, ఆగస్టు 27:జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఏకకాల ఎన్నికలే మేలని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2024 నుంచి లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.ప్రచారం వల్ల పాలనకు ఎలాంటి విఘాతం కలుగకుండా నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా ఈ ఎన్నికలు జరగాలని నీతి ఆయోగ్ ఓ అధ్యయన నివేదికలో తెలిపింది.

08/28/2017 - 01:22

హైదరాబాద్, ఆగస్టు 27: రక్షణ సన్నద్ధతలో మన సైన్యానికి సాటి లేదని, సాంకేతిక పరిజ్ఞానంలో ఈ రంగంలో ఇంకా ముందు కు వెళ్లాల్సిన అవశ్యకత ఉందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాస్తవ్రేత్తలనుద్దేశించి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని మిథానీ, బిడిఎల్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా తయారు చేసిన ‘అస్త్ర’ క్షిపణిని నేవీకి లాంఛనంగా అందజేశారు.

08/28/2017 - 01:20

పాట్నా ర్యాలీలో విపక్షాలు బిజెపి వ్యతిరేక శంఖారావం చేశాయి. మంచి రోజుల జాడే లేకుండా పోయిందంటూ మమతా బెనర్జీ బిజెపిపై నిప్పులు చెరిగితే నితీష్‌ను నమ్మడానికి లేదంటూ లాలూ ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో నిరుద్యోగం
పెరిగిపోయిందని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించి
ఈ ర్యాలీకి జెడియు సీనియర్ నేత శరద్ యాదవ్ హాజరయ్యారు.

08/28/2017 - 01:10

చండీగఢ్, ఆగస్టు 27:అత్యాచార కేసులో దోషిగా నిర్థారించిన డేరా సచ్ఛా సౌదా అధినేత గుర్మీత్ రామ్హ్రీం సింగ్‌కు సోమవారం శిక్ష ఖరారు కానుం ది. ఈ సందర్భంగా ఎలాంటి అలజడులు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ సంస్థకు చెందిన అనేక మంది నాయకుల్ని ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఈ శిక్షను వెలువరించనున్న రోహ్‌తక్ జిల్లా జైలులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Pages