S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2017 - 02:53

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రభుత్వం రంగ సంస్థ ఎయిర్ ఇండియాను లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు రెచ్చించిన ఉత్సాహంతో పనిచేస్తానని సంస్థ తాత్కాలిక సిఎండి, సీనియర్ ఐఎఎస్ రాజీవ్ బన్సాల్ వెల్లడించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానని గురువారం బాధ్యతలు చేపట్టిన బన్సాల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 50వేల కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తోంది.

08/25/2017 - 02:16

చెన్నై, ఆగస్టు 24: తమిళనాట అధికార అన్నాడిఎంకెలో సంక్షోభం రోజులో మలుపు తిరుగుతోంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం నచ్చని శశికళ బంధువు దినకరన్ వర్గం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని ఓ పక్క డిమాండ్ చేస్తుండగా ఆ 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు ప్రభుత్వం పావులుకదుపుతోంది. ప్రభుత్వం చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్ గురువారం ఈ మేరకు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

08/25/2017 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 24: గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవటంతోపాటు కర్నాటకలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బిజెపి అధినాయకత్వం సీనియర్ మంత్రులను రంగంలోకి దింపింది. గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్‌గా నియమించారు.

08/25/2017 - 02:15

మీరట్/లక్నో, ఆగస్టు 24: ట్రిపుల్ తలాఖ్ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే యూపీలోని ఓ వ్యక్తి భార్యకు తలాఖ్ చెప్పాడు. గర్భవతి అని కూడా చూడకుండా తలాఖ్ పేరుతో విడాకులు ఇచ్చాడు. సర్వోన్నత న్యాయస్థానం తలాఖ్ చెల్లదని తీర్పునిచ్చిన నేపథ్యంలో భర్తపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు మూహల్లా కమ్రా నవాబన్ ప్రాంతానికి చెందినది వారన్నారు.

08/25/2017 - 02:12

చిత్రాలు.. సూరత్‌లో గురువారం బిజెపి నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొని స్కూటర్ నడుపుతున్న స్మృతి ఇరానీ. అనంతరం దళిత కుటుంబం ఇంట భోజనం చేస్తున్న కేంద్ర మంత్రి

08/25/2017 - 02:08

లక్నో, ఆగస్టు 24: గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో 60 మంది చిన్నారుల మృతికి సంబంధించి తొమ్మిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బిఆర్‌డి మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌పైనా కేసు నమోదు చేశారు. అలాగే అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అనితా భట్నాగర్ జైన్‌పై బదిలీ వేటుపడింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలేక చిన్నారులు చనిపోయారు. మెస్సర్స్ పుష్పా సేల్స్ కంపెనీ యాజమానులపైనా కేసు నమోదైంది.

08/25/2017 - 02:08

చిత్రం..‘నీట్’లో తమిళనాడుకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ గురువారం చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తున్న డిఎంకె నేత స్టాలిన్ తదితరులు

08/25/2017 - 02:04

చిత్రం..రైల్వే బోర్డు చైర్మన్‌గా గురువారం రైల్ భవన్‌లో పదవీ బాధ్యతలు చేపడుతురన్న అశ్వని లోహానీ

08/25/2017 - 02:01

న్యూఢిల్లీ, ఆగస్టు 24: చిరకాల మిత్ర దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలను అనుమతించబోమని నేపాల్ గురువారం మన దేశానికి హామీ ఇచ్చింది. కాగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, నేపాల్‌లో భూకంపం అనంతర పునర్నిర్మాణ కార్యకలాపాల్లో సహకారం సహా ఎనిమిది ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

08/25/2017 - 01:41

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28 లేదా సెప్టెంబర్ 2వ తేదీనాడు కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. తమిళనాడు శాసనసభలో అన్నాడిఎంకె ప్రభుత్వం బలపరీక్ష జరిగిన అనంతరం కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణం జరుగుతుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

Pages