S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2017 - 03:15

న్యూఢిల్లీ, ఆగస్టు 21: గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమా పథకం వల్ల 90 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్టు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడిక్కడ వెల్లడించారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి పథకం అమలు తీరుతెన్నులపై ప్రధాని మోదీ అధ్యక్షత ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సమావేశం వివరాలను పిఎంఓ ఓ ప్రకటనలో వివరించింది.

08/22/2017 - 03:13

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా నేరస్తులు, నేరగాళ్లకు సంబంధించిన వివరాలు ఓ డేటాబేస్‌లో పొందుపరుస్తూ రూపొందించిన డిజిటల్ పోలీసు పోర్టల్‌ను కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం ఇక్కడ ప్రారంభించారు. ప్రజలు తమ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు పోర్టల్‌లో సదుపాయం పొందుపరిచినట్టు హోమ్‌మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల నమోదు, అభ్యర్థన, పరిశీలనలు అందుబాటులో ఉంటాయి.

08/22/2017 - 03:13

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాజకీయ పార్టీలకు వ్యక్తిగత విరాళాలు నగదు రూపంలో రూ.2000 మించి ఇవ్వరాదన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మేరకు సరైనదని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నించింది. దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయా పార్టీలను కమిటీ కోరింది.

08/22/2017 - 03:12

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఉత్తర రైల్వే ఖతౌలీ మార్గంలో సోమవారం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. శనివారం సాయంత్రం ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాల తప్పడంతో 22 మంది మృతి చెందారు. కనీసం 156 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రైల్లోని 13 బోగీలు పట్టాల తప్పడంతో మీరట్-ముజాఫర్‌నగర్-సహారన్‌పూర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

08/22/2017 - 03:11

న్యూఢిల్లీ, ఆగస్టు 21: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు పోస్టుల భర్తీ విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివిధ పోలీసు పోస్టుల భర్తీకి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నాలుగు వారాల్లో అఫిడవిట్ల రూపంలో తెలియజేయాలని 21 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.

08/22/2017 - 03:11

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత, చైనా సైన్యాల మధ్య సిక్కిం సెక్టార్‌లోని డొక్లామ్‌లో రెండు నెలల నుండి నెలకొన్న ఉద్రిక్తత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. భారత దేశంపై నిన్నటివరకు వ్యంగ్య బాణాలు విసరటంతోపాటు విషం కక్కిన చైనా పత్రికలు తమ వైఖరిని మార్చుకుని రెండు దేశాలు పరస్పర విశ్వాసంతో పనిచేయాలి, భారత్ గజము, చైనా డ్రాగన్ కలిసి నృత్యం చేయవచ్చునని సూచించాయి.

08/22/2017 - 03:04

న్యూఢిల్లీ , ఆగస్టు 21: పాత్రికేయ విద్యలో దేశంలోనే ఖ్యాతి గడించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) సంస్థకు డీమ్డ్ వర్శిటీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు యుజిసి కమిటీని నియమించింది. ఈ కమిటీకి భోపాల్ ఎంసి వర్శిటీ వైస్ ఛాన్సలర్ బికె.కుతియాల అధ్యక్షత వహిస్తారు. కమిటీలో పంజాబ్ యూనివర్శిటీ కమ్యూనికేషన్స్ విభాగం చైర్మన్ సంజయ్ వాద్వల్కర్, జి.రవీంద్రన్ సభ్యులుగా ఉంటారు.

08/22/2017 - 02:47

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును, పరిశుభ్రతను ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

08/22/2017 - 02:27

న్యూఢిల్లీ, ఆగస్టు 21: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం ధర్నాచౌక్ పరిరక్షణ సమితి నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్షాలు, తెదేపా, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ధర్నా చౌక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పరిరక్షణ సమితి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

08/22/2017 - 02:12

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించాల్సి ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని కొందరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కావటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

Pages