S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2017 - 02:11

బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు, ఉప ముఖ్యమంత్రులు సోమవారం న్యూఢిల్లీలో పార్టీ చీఫ్
అమిత్ షా అధ్యక్షతన భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సాంఘిక సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనం చేశారు.

08/22/2017 - 01:35

చెన్నై, ఆగస్టు 21: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకెలో గత ఏడు నెలలుగా కొనసాగుతున్న వైరివర్గాల వివాదానికి తెరపడింది. సిఎం పళనిస్వామి, రెబెల్ నేత పన్నీర్ సెల్వం మధ్య కుదిరిన రాజీతో సమస్య పరిష్కారమైంది. షరతులమీద షరతుల చందంగా సాగిన వివాదానికి తెరదించుతూ రెండువర్గాలు సోమవారం విలీనమయ్యాయి.

08/21/2017 - 02:18

చెన్నై, ఆగస్టు 20: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు విలీనమైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం పార్టీకి నాయకత్వం వహిస్తారని, ప్రస్తుత ముఖ్యమంత్రి కె పళనిస్వామి అలాగే కొనసాగుతారని పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన నాయకుడొకరు ఆదివారం చెప్పారు.

08/21/2017 - 02:17

న్యూఢిల్లీ, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ పరిరక్షణ సమితి అధ్వర్వంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.

08/21/2017 - 02:16

లక్నో/పాట్నా, ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాల్లో కుండపోత వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సం ఆదివారం కూడా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా ఈ మూడు రాష్ట్రాల్లో వరదల కారణంగా మరో 88 మంది మరణించారు. ఆదివారం వర్షాలు తెరిపివ్వడంతో పశ్చిమ బెంగాల్ కొంతమేర ఊపిరి పీల్చుకుంది. బిహార్‌లో మృతుల సంఖ్య 202 నుంచి 253కు పెరిగింది.

08/21/2017 - 02:14

న్యూఢిల్లీ, ఆగస్టు 20: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 73వ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సమాధి వీర్‌భూమి వద్ద ఆదివారం నిర్వహించిన కార్యమ్రానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, మాజీ స్పీకర్ మీరాకుమార్, ప్రియాంక గాంధీ తదితరులు హాజరై నివాళులర్పించారు.

08/21/2017 - 02:09

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లో శనివారం సాయంత్రం ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదం వెనుక సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక కారణం కావచ్చని రైల్వేశాఖ అనుమానిస్తోంది. రైలు పట్టాలపై అనుమతి లేకుండా ఏవయినా మెయింటెనెన్స్ పనులు చేపట్టారా అనే విషయం దర్యాప్తులో నిర్ధారణ అవుతుందని రైల్వే శాఖ సభ్యుడు (ట్రాఫిక్) మహమ్మద్ జంషెడ్ ఆదివారం ఇక్కడ చెప్పారు.

08/21/2017 - 02:34

ముంబయి / లక్నో, ఆగస్టు 20: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో మావోయిస్టులకు అలాగే కాశ్మీర్‌లోని వేర్పాటువాదులకు నిధులు అందకుండా పోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ముంబయిలో స్పష్టం చేస్తే, జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నిర్వహిస్తున్న గురుతర పాత్ర కారణంగా కాశ్మీర్‌లో రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు తగ్గిపోయాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

08/21/2017 - 01:45

జమ్మూ, ఆగస్టు 20: అయిదేళ్లలో భారత దేశంనుంచి ఉగ్రవాదాన్ని, అవినీతిని తుడిచి పెట్టాలనేది ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదం తుది దశకు చేరుకుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.

08/21/2017 - 01:36

భువనేశ్వర్, ఆగస్టు 20: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఉగ్రవాద ముప్పును ప్రతిఘటించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఎన్‌ఎస్‌జి (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) సిద్ధమవుతోంది. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయ భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎన్‌ఎస్‌జికి చెందిన సీనియర్ అధికారులు త్వరలో పూరీ పట్టణాన్ని సందర్శిస్తారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Pages