S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/18/2017 - 03:32

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఘోరంగా విఫమైందని, ఇప్పుడున్నదంతా ‘మేడ్ ఇన్ చైనా’ మాత్రమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.

08/18/2017 - 03:30

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మన దేశ జిడిపిలో ఖనిజ రంగం 2.6 శాతం వాటాను అందిస్తోందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. గురువారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 2013-14 సంవత్సరానికిగాను గనుల విభాగాలలో భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ ఖనిజ రంగం ప్రతి రోజు సగటున ఒక మిలియన్ కంటే ఎక్కువ మందికి నేరుగా ఉపాధి కల్పిస్తోందని అన్నారు.

08/18/2017 - 03:27

గ్రీన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం కాలుష్యంతో సతమతమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని కొన్ని సరస్సుల్లో నురగలు ఏర్పడి అవి పరిసరాల్లోకి, ప్రధాన రహదారుల మీదికి వస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బెల్లందూర్ సరస్సునుంచి గురువారం రోడ్డు మీదకి వచ్చిన నరుగ.

08/18/2017 - 03:25

న్యూఢిల్లీ, ఆగస్టు 17: చైనా, పాకిస్తాన్‌ను నుంచే ఎదురయ్యే సవాళ్లను భారత్ ఎదుర్కొంటుందని, అయితే అంతర్గతంగా కొన్ని శక్తులు సమాజాన్ని ముక్కలు చేస్తున్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల్లో ఎవరి పేరునూ ఆయన ప్రస్తావించలేదు. జెడి(యు) నేత శరద్ యాదవ్ గురువారం ఇక్కడ నిర్వహించిన ‘వారసత్వ పరిరక్షణ’ సమావేశంలో ఫరూఖ్ పాల్గొన్నారు.

08/18/2017 - 03:24

న్యూఢిల్లీ, ఆగస్టు17: పార్టీ అధినాయకత్వం తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా సంజయ్‌గాంధీ కుమారుడు, సుల్తాన్‌పూర్ లోక్‌సభ సభ్యుడు వరుణ్‌గాంధీ త్వరలోనే బిజెపికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటినుండి తనను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ఆయన తీవ్ర అసంతృత్తితో ఉన్నారు.

08/18/2017 - 03:22

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఉపరాష్టప్రతిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య నాయుడును పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖలు కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి బాలకృష్ణన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరి, సిబిఐ డైరెక్టర్ ఆలోక్ కుమార్ వర్మ ఉపరాష్టప్రతిని కలిశారు.

08/18/2017 - 03:20

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరుతూ 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరయిన లెఫ్టెనెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తీర్పును గురువారం వాయిదా వేసింది. పిటిషన్‌పై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తులు ఆర్‌కె అగర్వాల్, ఎఎం సప్రేలతో కూడిన బెంచ్ తెలిపింది.

08/18/2017 - 02:42

ఊడలు కాదు.. గోళ్లే! పశ్చిమ బెంగాల్‌కు చెందిన మురారి మూడు దశాబ్దాలుగా గోళ్లను పెంచడమే పనిగా పెట్టకున్నాడు. ఈ విషయంలో ఆయన గిన్నిస్ రికార్డులకూ ఎక్కారు. ప్రస్తుతం వాటి పొడవు 38 అంగుళాలు.

08/18/2017 - 02:38

కోల్‌కతా, ఆగస్టు 17: భారత దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను వక్రీకరించారని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ పాత్రను సక్రమంగా నిర్వచించడంకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు.

08/18/2017 - 02:37

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బిహార్‌లో ఓ అత్యాచార బాధితురాలికి పది లక్షల రూపాయల పరిహారం అందించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలు ప్రస్తుతం ఆరునెలల గర్భవతి. ఆమె 17 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు అబార్షన్‌కు పాట్నా హైకోర్టు అనుమతించలేదు. దీంతో ఇప్పుడు అబార్షన్ చేస్తే ఆమెకు, కడుపులో ఉన్న బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Pages