S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/18/2017 - 02:26

న్యూఢిల్లీ, ఆగస్టు 17: తెలంగాణ విద్యుత్ సంస్థ ఏఇల నియామకంలో మిగిలిపోయిన 239 పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు అదేశించింది. 4 విద్యుత్ సంస్థల్లో ఖాళీగావున్న ఉద్యోగాలకు తాజా నోటిఫికేషన్ అవసరం లేకుండ, గతంలో నిర్వహించిన పరీక్షల మెరిట్ లిస్టు ఆధారంగా భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ కేసులో గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత కోర్టు తోసిపుచ్చింది.

08/18/2017 - 01:26

చెన్నై, ఆగస్టు 17: తమిళనాడు మాజీ సిఎం జయలలిత మరణంపై ముసిరిన అనుమానాల నిగ్గు తేల్చేందుకు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. జయ మరణం దర్యాప్తు జరిపి తీరాలంటూ మాజీ సిఎం పన్నీర్ సెల్వం డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

08/18/2017 - 02:19

భారతీయ జనతా పార్టీపై సంఘటిత పోరాటానికి పిలుపునిస్తూ పనె్నండుకు పైగా

08/18/2017 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అవినీతి వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో అవినీతి వ్యవస్థీకృతమైందన్న మోదీ, సామాన్యుడి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు.

08/17/2017 - 02:11

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీసహా పలు ప్రాంతాల్లో సిక్కులకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి 199 కేసులను మూసివేయాలని కేంద్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయాన్ని పునఃపరిశీలించడానికి సుప్రీంకోర్టు బుధవారం ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన ఒక పర్యవేక్షక కమిటీని నియమించింది.

08/17/2017 - 02:08

గోరఖ్‌పూర్: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలోని బిఆర్‌డి మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో మెదడు వాపువ్యాధితో మృతిచెందిన చిన్నారి తండ్రి ఒకరు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైద్య విద్యాశాఖ మంత్రి, గోరఖ్‌పూర్ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీపై పోలీసు కేసు పెట్టారు.

08/17/2017 - 02:08

జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దులోని జనావాసాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడని సైనిక అధికారులు వెల్లడించారు. ఐదోరోజు వరుసగా పాక్ దళాలు కాల్పులు జరిపాయని ఆయన అన్నారు.

08/17/2017 - 02:07

న్యూఢిల్లీ: జైళ్ల సంస్కరణలకు సంబంధించి కోర్టు ఆదేశాలను పాటించడానికి రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టును కోరింది.

08/17/2017 - 02:07

న్యూఢిల్లీ: దేశంలో పిల్లల ఆత్మహత్యలకు కారణమవుతున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌ను తొలగించని నెట్‌వర్క్ ఆధారిత సామాజిక మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం హెచ్చరించారు. బ్లూవేల్ గేమ్ కారణంగా అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇప్పటికే తమకు ఇందుకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు.

08/17/2017 - 02:07

న్యూఢిల్లీ: బిహార్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. జెడి(యు) నాయకుడు శరద్ యాదవ్ సారథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలుసహా ప్రతిపక్ష నేతలు గురువారం కీలక భేటీ జరపబోతున్నారు. దేశ ఉమ్మడి సంస్కృతిని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోందని శరద్ యాదవ్ పేర్కొన్నారు. సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీ, టిఎంసి సహా బిజెపిని వ్యతిరేకిస్తున్న అనేక పార్టీలకు శరద్ యాదవ్ ఆహ్వానం పలికారు.

Pages