S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/15/2017 - 01:15

న్యూఢిల్లీ, ఆగస్టు 14: రానున్న ఐదేళ్లలో నవ భారత నిర్మాణం కోసం పౌరులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నూతన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. నవ భారతం అంటే కుటుంబానికో ఇల్లు, అడిగిన వెంటనే విద్యుత్, మెరుగైన రోడ్లు, టెలికామ్ సర్వీసులు, ఆధునిక రైల్వే నెట్‌వర్క్, నిలకడయిన, వేగంగా అభివృద్ధి సాధించడమని నిర్వచించారు.

08/15/2017 - 01:10

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇటు భూతలం.. అటు గగనతలంలో రెప్పవాల్చని నిఘా. అడుగేస్తే కనిపెట్టేసే డేగకన్ను. 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని నగరం భద్రతా వలయంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించే ఎర్రకోట మొదలుకొని రాజధాని నగరం యావత్తూ నిఘా గుప్పిట్లోకి వచ్చింది. ఇటు స్వాతంత్య్ర దినోత్సవం, అటు కృష్ణాష్టమి ఒకే రోజు రావడంతో భద్రతా దళాలు మరింతగా అప్రమత్తమయ్యా యి.

08/15/2017 - 01:35

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన తెలంగాణ పోలీసులకు కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. తెలంగాణ పోలీసులకు మొత్తం 13 పతకాలు దక్కాయి. రాష్టప్రతి విశిష్ట సేవా పతకాలను తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న సి.వి అనంద్ (ఐపిఎస్), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ డిసిపి బాలకృష్ణ దక్కించుకున్నారు.

08/14/2017 - 03:07

పంద్రాగస్టు వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సన్నద్ధమవుతోంది. ఎర్రకోట వద్ద నిర్వహించే వేడుకల కోసం ఆదివారం
ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహిస్తూ భారత్ ఘనతను చాటి చెబుతున్న స్కూలు పిల్లలు

08/14/2017 - 03:01

ఆదివారం గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని సందర్శించిన యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా. వీరి రాకను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారిని చితకబాధుతున్న పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు

08/14/2017 - 02:33

న్యూఢిల్లీ, ఆగస్టు 13: పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా నిందితులకు ట్రయల్ కోర్టులు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు తక్షణమే స్వస్తిచెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన ధర్మాసనం దేశంలోని అన్ని జుడీషియల్ అకాడమీల డైరెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేసింది.

08/14/2017 - 02:32

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రవాస భారతీయులకు కూడా మన దేశంలో ఓటు హక్కును వినియోగించుకునే అర్హతను ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం 24 వేల మంది విదేశీయులు మాత్రమే మన దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. విదేశాల్లోని భారతీయులు ఎక్కువమంది ఓటర్లుగా నమోదు చేసుకోవడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ వారికోసం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.

08/14/2017 - 02:31

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశంలోనే తొలిసారి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ఫర్సత్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన ఏవియేషన్ యూనివర్శిటీ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 18వ తేదీన ఈ యూనివర్శిటీని ప్రారంభించనున్నారు.

08/14/2017 - 02:31

జమ్మూ, ఆగస్టు 13: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గత ఇరవై నాలుగు గంటల్లో పాక్ కాల్పులకు తెగబడడం ఇది మూడోసారి. పూంచ్ జిల్లా మన్‌కోటే సెక్టార్‌లో ఆదివారం ఉదయం పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయని, అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.

08/14/2017 - 02:30

న్యూఢిల్లీ, ఆగస్టు 13: అద్దె గర్భం (సరోగసీ) ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే దంపతులు ఐదేళ్లపాటు నిరీక్షించాలన్న నిబంధన విధించడం సంతానోత్పత్తి విషయంలో వారికి గల హక్కులను హరించడమే అవుతుందని, అంతేకాకుండా ఆలస్యంగా వివాహం చేసుకుని సహాయక పద్ధతులద్వారా సంతానాన్ని పొందాలనుకునే దంపతులు ఈ నిబంధన వలన తల్లిదండ్రులు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది.

Pages