S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/08/2018 - 16:39

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో లీలావతి ఆసుపత్రిలో చేరారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

10/08/2018 - 12:32

లక్నో: రానున్న మూడేళ్లలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన లక్నోలోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఆఫీసులో జరిగిన రాపిడి యాక్షన్ ఫోర్స్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో ఉండే వామపక్ష తీవ్రవాదం నేడు 10 నుంచి 12 జిల్లాల్లో మాత్రమే ఉందని, దీన్ని కూడా రానున్న కాలంలో తుదిముట్టిస్తామని చెప్పారు.

10/08/2018 - 02:56

డెహ్రాడూన్: ప్రపంచంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా భారత్ అవతరించిందని, సామాజిక, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల వృద్ధిరేటు ఊపందుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రం తొలిసారిగా ఏర్పాటు చేసిన మొదటి ఇనె్వస్టర్ల సదస్సు 2018ను ప్రారంభించారు.

10/08/2018 - 01:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్ రక్షణ రంగంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రష్యాతో ఎస్-400 ట్రింఫ్ మిసైళ్ల కొనుగోళ్ల ఒప్పందం నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధిస్తుందన్న భయాలను ఆయన కొట్టిపారేశారు. ఇటువంటి ఆందోళనల వల్ల ప్రయోజనం లేదన్నారు.

10/08/2018 - 01:21

లక్నో, అక్టోబర్ 7: కాంగ్రెస్ కంచుకోటగా భావించే యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రతిష్టను తగ్గించడానికి బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది.

10/08/2018 - 01:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)తో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘రాష్ట్రాల స్థాయిలో చర్చలు విఫలమైనంత మాత్రాన లోక్‌సభ పొత్తులపై ఎలాంటి ప్రభావం ఉండదు. మహాకూటమిపై ఏ మాత్రం ప్రభావం చూపదు’అని కాంగ్రెస్ స్పష్టం చేసింది.

10/08/2018 - 01:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఓడించాలంటే కాంగ్రెస్ హైకమాండ్ తన అహంభావాన్ని కొద్దిగా తగ్గించుకుని మిత్రపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయటం మంచిదని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సలహా ఇచ్చారు.

10/08/2018 - 01:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో బీజేపీకి భంగపాటు తప్పదా? అంటే తప్పదనే వెల్లడిస్తున్నాయి ఒపీనియన్ పోల్స్. వసుంధర రాజే నేతృత్వంలోని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వానికి ఈసారి భారీ ఓటమి ఖాయమని, రెండు దశాబ్దాల బీజేపీ హవాకి ఇక తెరపడినట్టేనని చెబుతున్నాయి ఈ ఒపీనియన్ పోల్స్.

10/08/2018 - 01:27

లక్నో, అక్టోబర్ 7: వచ్చే మూడేళ్లలో దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆదివారం ఇక్కడ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) 26వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఆర్‌ఏఎఫ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

10/07/2018 - 03:57

న్యూఢిల్లీ: స్వలింగసంపర్కంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లైంగికత్వం అనేది వాక్‌స్వాతంత్య్రంలో భాగమని అభిప్రాయం సరికాదన్నారు. వాక్‌స్వాతంత్య్రంలో భాగమని చెప్పడం వల్ల పాఠశాలల హాస్టళ్లు, జైళ్లు, ఆర్మీలో స్వలింగసంపర్కం, ఉభయ లైంగిక సంపర్కంను నియంత్రించాలా వద్దా అనే సందేహాలు తలెత్తుతాయన్నారు.

Pages