S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2016 - 17:49

దిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ మంగళవారం రాజీనామా చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి ఆయన తొలి ఇండిపెండెంట్ చైర్మన్ కాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో రాజీనామా చేయడం గమనార్హం. ఐసిసిలో పదవి చేపట్టేవారు స్వతంత్రంగా ఉండాలని, మరో క్రికెట్ సంఘంలో బాధ్యతలు కొనసాగించరాదన్న నిబంధన ఉంది. ఈ కారణంగానే మనోహర్ బిసిసిఐ అధ్యక్ష పదవిని వదులుకున్నారని తెలుస్తోంది.

05/10/2016 - 17:48

దిల్లీ: సివిల్ సర్వీసెస్ (మెయిన్)- 2015 పరీక్షా ఫలితాలను యుపిఎస్‌సి మంగళవారం సాయంత్రం ఇక్కడ విడుదల చేసింది. దిల్లీకి చెందిన టీనా దబీ ఫస్ట్ ర్యాంకును, జమ్ము-కాశ్మీర్‌కు చెందిన అత్హర్ అమీర్ రెండో ర్యాంకును కైవసం చేసుకున్నారు. జస్మీత్‌సింగ్ సంధూ, ఆర్తికా శుక్లా, శశాంక్ త్రిపాఠీలకు వరుసగా 3,4, 5 ర్యాంకులు దక్కాయి.

05/10/2016 - 17:48

దిల్లీ: నిబంధనలకు అనుగుణంగానే తాము ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నామని, ఎపికి చెందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా తాము వాడుకోవడం లేదని తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీకి వివరించారు. కరవు పరిస్థితుల నుంచి గట్టెక్కేలా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన మోదీని కోరారు.

05/10/2016 - 17:47

దిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో కెసిఆర్ మాట్లాడుతూ, కరవుసాయం, విభజన చట్టంలోని హామీల అమలు గురించి ప్రధానంగా మాట్లాడానని తెలిపారు. 7 జిల్లాల్లో 231 కరవు మండలాలను ప్రకటించామని, వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గిందని ఆయన ప్రధానికి వివరించారు.

05/10/2016 - 17:47

దిల్లీ: ఎనిమిది డ్యాన్స్‌బార్లకు రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయాలని సుప్రీం కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం మహారాష్ట్ర సర్కారును మంగళవారం ఆదేశించింది. డాన్స్‌బార్ల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బిచ్చమెత్తుకోవడం కంటే డాన్స్‌బార్లలో నృత్యం చేస్తూ సంపాదించడం నయమేనంటూ గతంలో కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

05/10/2016 - 17:46

దిల్లీ: పార్టీ ఎంపీలంతా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాలని బిజెపి ఎంపీలను ప్రధాని మోదీ ఆదేశించారు. ఇక్కడ మంగళవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఎంతో ప్రచారం చేస్తోందని, వాటి పట్ల ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నారు. ఈనెల 26తో మోదీ ప్రధాని పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

05/10/2016 - 17:45

గయ: తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని తుపాకీతో కాల్చిచంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ తాను నిర్దోషినని మీడియాకు తెలిపాడు. సంఘటన జరిగిన రోజున తాను దిల్లీలో ఉన్నానని, తన తల్లి పిలిస్తే అక్కడికి వెళ్లానని అంటున్నాడు. తనపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అన్ని విషయాలూ

05/10/2016 - 14:22

దిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష ఫలితం ప్రధాని మోదీకి గట్టి గుణపాఠం అవుతుందని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో మంగళవారం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలన్న ఆలోచనలకు మోదీ ఇకనైనా స్వస్తి పలకాలన్నారు.

05/10/2016 - 14:21

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం జరిగిన బలపరీక్షలో మాజీ సిఎం హరీష్ రావత్ గెలిచారని బిజెపి ఎమ్మెల్యే గణేష్ జోషి చెప్పడం సంచలనం కలిగించింది. తనకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది గనుక హరీష్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా, ఇదే విషయాన్ని విపక్ష ఎమ్మెల్యే జోషి చెప్పడం గమనార్హం. బిజెపికి 28 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తేలిందని బలపరీక్ష అనంతరం జోషి విలేఖరులకు తెలిపారు.

05/10/2016 - 14:21

దిల్లీ: తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, కేంద్ర సాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, విభజన సమస్యలు తదితర విషయాలపై కెసిఆర్ ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.

Pages