S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/17/2017 - 01:23

న్యూఢిల్లీ,జూలై 16: ఉపరాష్టప్రతి పదవికి కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేరును బిజెపి అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై లోతుగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

07/17/2017 - 01:19

న్యూఢిల్లీ, జూలై 16: పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ క్షమాబిక్ష పిటిషన్‌ను పాకిస్తాన్‌లోని మిలిటరీ కోర్టు తిరస్కరించింది. ఇక ఇప్పుడు ఆయనకు క్షమాబిక్ష పెట్టాలా వద్దా అనే దానిపై నిర్ణయం ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వా పైనే ఆధారపడి ఉందని పాక్ ఆర్మీకి చెందిన మీడియా విభాగం ఐఎస్‌పిఆర్ తెలిపింది.

07/17/2017 - 01:39

న్యూఢిల్లీ, జూలై 16: గోసంరక్షణ పేరిట గూండాయిజాన్ని సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఈ పెడ ధోరణిని తిప్పికొట్టాలని ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. గోసంరక్షణ పేరుతో హింసాకాండకు పాల్పడుతున్న సంఘ వ్యతిరేకుల శక్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

07/17/2017 - 01:16

న్యూఢిల్లీ, జూలై 16: రాష్టప్రతి ఎన్నికలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధంతో ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. తమ అభ్యర్థిగా మీరాకుమార్‌ను పోటీకి పెట్టడానికి కారణం సంకుచిత, విచ్ఛిన్నకర, మతతత్వ ధోరణులను ప్రతిఘటించాలన్నదేనని ఆదివారం ఇక్కడ సోనియా స్పష్టం చేశారు.

07/17/2017 - 01:14

న్యూఢిల్లీ, జూలై 16: కొత్త రాష్టప్రతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిపి 4,852 సభ్యులు రాష్టప్రతిని ఎన్నుకునేందుకు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పార్లమెంటుతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో సోమవారం ఉదయం పదకొండు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఎన్‌డిఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏడు లక్షల ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు.

07/16/2017 - 04:54

చిత్రం.. ప్రచారం నిమిత్తం గోవా వచ్చిన ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు
స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి మనోహర్ పారికర్

07/16/2017 - 03:35

న్యూఢిల్లీ, జూలై 15: దేశాన్ని పట్టి పీడిస్తున్న వారసత్వ రాజకీయాలు, కులతత్వం, మైనారిటీల బుజ్జగింపు అనే రుగ్మతలను రూపు మాపడానికి, విద్యావిధానంలోని లోపాలను తొలగించడానికి, దేశ విద్యా విధానాన్ని దాని సాంస్కృతిక విలువలతో అనుసంధానం చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా పిలుపునిచ్చారు.

07/16/2017 - 03:32

జంగీపూర్, జూలై 15: పశ్చిమ బెంగాల్‌లోని జంగీపూర్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద మహిళలను వంట గ్యాస్ కనెక్షన్ అందజేశారు. దేశంలోని ఐదుకోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్ ఇవ్వాలన్నది ఉజ్వల యోజన లక్ష్యం. కాలుష్యం నివారించి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో గత మే నెలలో కేంద్రం ఉచిత ఎల్‌పిజి కనెక్షన్ పథకాన్ని తీసుకొచ్చింది.

07/16/2017 - 03:30

న్యూఢిల్లీ, జూలై 15: కెనడాకు చెందిన భారతీయ సంతతి మహిళ, యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ యూనిసెఫ్ గ్లోబల్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. శనివారం ఢిల్లీలో యునిసెఫ్ నిర్వహించిన ‘యూత్ 4చేంజ్’ కార్యక్రమంలో 28ఏళ్ల లిల్లీని అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మహిళల సాధికారత, బాలల హక్కుల, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినందుకు లిల్లీ సింగ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

07/16/2017 - 03:37

పాట్నా, జూలై 15: బిహార్‌లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం నగరంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తోపాటుగా ఒక కార్యక్రమానికి హాజరు కావలసిన ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఆ కార్యక్రమానికి గైరు హాజరుకావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.

Pages