S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/15/2017 - 02:03

అసోంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయ. శుక్రవారం కామరూప్ జిల్లాలో సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు తన పిల్లలతో వరద ప్రవాహాన్ని దాటుతున్న ఓ మహిళ.

07/15/2017 - 02:01

న్యూఢిల్లీ, జూలై 14: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి చెందిన ఢిల్లీలోని హోటల్ లీలా ప్యాలెస్ రూమ్‌కు సంబంధించి నివేదిక అంజేయాలని కోర్టు ఆదేశించింది. సునంద రూమ్ నెంబర్ 345లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 2014 జనవరిలో ఈ సంఘటన చోటుచేసుకోగా అప్పటి నుంచి ఆ రూమ్ సీల్‌చేసే ఉంది. రూమ్ తెరుచుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ హోటల్ లీలా ప్యాలెస్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

07/15/2017 - 01:57

న్యూఢిల్లీ, జూలై 14: ‘కలసి వుంటే కలదు సుఖం. విడిపోతే మనకే నష్టం’ అంటూ నీతీశ్, లాలూకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కౌనె్సలింగ్ ఇచ్చారు. బీహార్‌లోని ‘మహాఘటబంధన్’ తెగిపోయే పరిణామాలు తలెత్తిన తరుణంలో సోనియా జోక్యం చేసుకొని ఇద్దరు నేతలతో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

07/15/2017 - 01:56

పుదుచ్చేరి, జూలై 14: అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న అన్నాడిఎంకె నాయకురాలు శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న విషయాన్ని బయటపెట్టిన జైళ్లశాఖ డిఐజి డి రూపపై పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ప్రశంసలు కురిపించారు. ‘రూప లాంటి నిజాయితీ గల అధికారులు మనకు అవసరం. యువత ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి’ అని కిరణ్‌బేడీ పిలుపునిచ్చారు. రూపను ప్రశంసిస్తూ ఆమె ట్వీట్ చేశారు.

07/15/2017 - 01:55

న్యూఢిల్లీ, జూలై 14: భారత దేశం అనుసరిస్తున్న ప్రాచ్య దృక్పధానికి మైన్మార్ మూల స్తంభం అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ పొరుగు దేశంతో అన్ని విధాలుగా, అన్ని రంగాల్లోనూ ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు గట్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

07/15/2017 - 01:54

న్యూఢిల్లీ, జూలై 14: విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి ఇక్కడకు తీసుకువస్తేగాని అతనిపై ఉన్న కోర్టు ధిక్కార కేసుపై విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 9వేల కోట్ల బ్యాంక్ లోన్ ఎగవేతలో నిందితుడైన విజయ్ మాల్యాను భారత్ రప్పించడానికి తీసుకుంటున్న చర్యలపై కేంద్రం సమర్పించిన నివేదికను సుప్రీం కోర్టు ధర్మాసనం పరిశీలించింది.

07/15/2017 - 01:53

ఫగ్వారా (పంజాబ్), జూలై 14: కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జనం ముక్తకంఠంతో నిరసించారు. దాడికి నిరసనగా హిందూ సంస్థలు శుక్రవారం ఇచ్చిన బంద్‌కు అన్ని మతాలవారూ మద్దతు ఇచ్చారు. అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా బంద్ దృష్ట్యా ఇండో-పాక్ బస్సు సర్వీసులను దారిమళ్లించారు.

07/15/2017 - 01:15

లక్నో, జూలై 14: ఉత్తరప్రదేశ్ పోలీసుల భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపే విధంగా ఏకంగా అసెంబ్లీ భవనంలోపలే పేలుడు పదార్థాలు కనిపించడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఉలిక్కి పడ్డారు.

07/15/2017 - 01:07

న్యూఢిల్లీ, జూలై 14: చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదంలో ఆచితూచి అడుగేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు ఎన్డీయే సర్కారుకు హితవు పలికారు. సిక్కిం సెక్టార్ సరిహద్దు సమస్యను వీలైనంత వరకు శాంతియుత పద్ధతిలో దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. దేశరక్షణ విషయంలో తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చారు.

07/15/2017 - 01:04

కసాయిగా మారి ప్రాణాలు తీసే ఉగ్రవాదులనూ క్రికెట్ ఫీవర్ వెంటాడుతోంది. ఏకంగా ఏకె 47 రైఫిల్‌ని స్టంప్‌గా పెట్టుకుని క్రికెడ్ ఆడుతూ వీడియోకి ఎక్కిన ఉగ్రవాదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దక్షిణ కాశ్మీర్‌లో ఉగ్రవాదలు రైఫిల్‌నే వికెట్ చేసుకుని క్రికెట్ ఆడటమే కాకుండా, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాకు విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇదీ ప్రస్తుతం కాశ్మీర్ పరిస్థితి.

Pages