S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/14/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 13: దేశ రాజధానిలో వారం రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన వైద్యుడు శ్రీకాంత్ గౌడ్ (29) ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. గత గురువారం అర్ధరాత్రి ప్రీతివిహార్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ కీడ్నాప్ చేసి ఓలా యజమాన్యాన్ని రూ.5కోట్లు డిమాండ్ చేశాడు. ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేసి 27 మందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ పురోగతి కనిపించలేదు.

07/14/2017 - 01:28

ముంబయి, జూలై 13: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 1.54 శాతానికి తగ్గిపోవడం, రుతు పవనాలు, వస్తు సేవల పన్ను అమలులో సానుకూల ధోరణలు లాంటి సానుకూల సంకేతాల కారణంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 232 పాయింట్లకు పైగా పెరిగి తొలిసారి 32 వేల పాయింట్లను దాటింది.

07/14/2017 - 01:22

న్యూఢిల్లీ,జూలై 13: కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్‌తో మాత్రమే చర్చలు జరుపుతామని, మూడో దేశం మధ్యవర్తిత్వానికి అంగీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం కరాఖండీగా ప్రకటించింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చైనా ఇటీవల ప్రకటించటం తెలిసిందే.

07/13/2017 - 02:53

బెంగళూరు, జూలై 12: ఉపగ్రహ ప్రయోగ సమయంలో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే రాకెట్ గమనాన్ని గుర్తించడానికి తోడ్పడే నౌకలపై ఏర్పాటు చేయగలిగిన ఒక యాంటెనా టెర్మినల్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్ అయిన ‘ఇస్ట్రాక్’ రూపొందించింది.

07/13/2017 - 02:53

న్యూఢిల్లీ, జూలై 12: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వంశాన్ని అప్రతిష్టపాలు చేసేవిధంగా తెరకెక్కించిన ‘ఇందు సర్కార్’ సినిమాను నిలిపివేయాలని ఇందిర మనుమరాలిగా, సంజయ్ కూతురిగా చెప్పుకుంటున్న ప్రియాసింగ్ పాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న వయసులోనే తనను దత్తత ఇచ్చారనీ, వయసు పెరిగిన తర్వాత తన తండ్రి సంజయ్‌గాంధీ అని చెప్పారనీ 48 ఏళ్ల ప్రియాసింగ్ వెల్లడించారు.

07/13/2017 - 02:53

పాట్నా, జూలై 12: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు బుధవారం ఫోన్‌చేసి ఉప రాష్టప్రతి అభ్యర్థి గోపాల్‌కృష్ణ గాంధీకి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జెడియు నేత కెసి త్యాగి ధృవీకరించారు. ప్రతిపక్ష పార్టీల తరఫున గాంధీని ఉపరాష్ట్ర అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

07/13/2017 - 02:52

న్యూఢిల్లీ, జూలై 12: అవినీతి కేసులో భాగంగా జరిపిన సోదాల్లో ఆదాయం పన్ను శాఖ జార్ఖండ్ ప్రిన్సిపల్ కమిషనర్‌కు చెందిన కోల్‌కతా నివాసంలో రూ.3.5 కోట్ల నగదు, 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సిబిఐ ) బుధవారం తెలిపింది.

07/13/2017 - 02:52

న్యూఢిల్లీ, జూలై 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్లనే జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు అవకాశమిచ్చినట్లయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విమర్శించారు. సోమవారం అనంత్‌నాగ్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన రాహుల్ మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

07/13/2017 - 02:51

ముంబయి, జూలై 12: అమర్‌నాథ్ యాత్రికుల దాడికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఎన్‌డిఏ మిత్రపక్షమైన శివసేన విరుచుకుపడింది. ప్రధాని నరేంద్రమోదీ, బిజెపిలపై సేన దుమ్మెత్తిపోసింది. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులపై పోరాడడానికి గోరక్షకులను పంపాలని శివసేన సలహాఇచ్చింది. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు పేపర్లలో ఖండించడమే తప్ప అలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలూ ఉండడం లేదని సేన అధికార పత్రిక ‘సామ్నా’లో ధ్వజమెత్తింది.

07/13/2017 - 02:51

పాట్నా, జూలై 12: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ముదురుతోంది. డిఫ్యూటీ సిఎం తేజస్వీ యాదవ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనంటున్న ముఖ్యమంత్రి దానికి నాలుగు రోజులు గడువు ఇచ్చారు. ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై సిబిఐ దాడుల నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్యపక్షాలైన జెడియు, ఆర్‌జెడిల మధ్య దూరం మరింత పెరిగిపోయింది.

Pages