S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/12/2017 - 01:32

న్యూఢిల్లీ, జూన్ 11:చిన్న వ్యాపారస్తులకు ఊరట కలిగించడంతో పాటు వినియోగదారులకూ ఉపశమనాన్ని అందించే రీతిలో మరో 66 దైనందిన వినియోగ వస్తువులపై జిఎస్‌టి పన్ను తగ్గింది. మరో మూడువారాల్లో ఒకే దేశం ఒకే పన్ను అన్న చారిత్రక నినాదంతో ముందుకెళ్లనున్న కేంద్రం క్రమానుగంగా వ్యాపారస్తుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ అమలు మార్గాన్ని సుగమం చేసుకుంటోంది.

06/11/2017 - 23:49

న్యూఢిల్లీ, జూన్ 11: దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి యుద్ధ ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవటానికి వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజధానిపై జీవ రసాయనాయుధాల దాడి, అణ్వస్త్ర దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా సాయుధ సంపత్తితో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సంసిద్ధం చేశారు. ఢిల్లీలోని ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన ఈ దళంలో 30మంది సుశిక్షుతులైన సిబ్బంది ఉంటారు.

06/11/2017 - 23:48

న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర మంత్రుల పని తీరుపై పిఎంఓ కార్యాలయం నిఘా పెట్టింది. ఏ మంత్రి వద్ద ఏయే ఫైళ్లు ఎన్ని రోజుల నుంచీ పెండింగ్ ఉన్నాయో ఆరేతీసే పనిలో పిఎంఓ కార్యాలయం తలమునకలైంది. రాష్టప్రతి ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యస్థీకరణ జరగవచ్చునన్న ప్రచారానికి ఈ వార్త బలం చేకూరుస్తోంది.

06/11/2017 - 23:48

న్యూఢిల్లీ, జూన్ 11: హిందువులకు పరమ పవిత్రమైన కైలాస మానస సరోవర యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఈ యాత్రకు బయలుదేరిన మొదటి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ భవన్‌లో జెండా ఊపి వారిని ముందుకు సాగనంపారు.

06/11/2017 - 05:09

ఔను.. మీరు ఊహించింది నిజమే.. బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. కేరళలో పర్యటిస్తున్న అద్వానీ కొట్టాయంలోని వెంబనాడు సరస్సులో ఇలా పడవలో ప్రయాణం చేశారు

06/11/2017 - 05:13

కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ రాసిన ‘ఇందిరా గాంధీ - ఎ లైఫ్ ఇన్ నేచర్’ పుస్తకాన్ని శనివారం ఢిల్లీలోని
ఇందిరా గాంధీ స్మారక మ్యూజియంలో ఆవిష్కరిస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ. చిత్రంలో మాజీ ప్రధాని
మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్, ప్రియాంకా గాంధీ

06/11/2017 - 05:00

భోపాల్, జూన్ 10: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మధ్యప్రదేశ్‌లో రైతులు చేస్తున్న ఆందోళన పదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వారిని శాంతింపజేయడానికి, రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరింపజేయడానికి శనివారం ఇక్కడి దసరా మైదానంలో ఉపవాస దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు లాభదాయకమైన ధరలు లభించేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

06/11/2017 - 04:55

చిత్రం. మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీసు కాల్పులకు నిరసనగా శనివారం కోల్‌కతాలో, బెంగళూరులో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను తగులబెడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు

06/11/2017 - 03:31

రాయపూర్, జూన్ 10: జాతిపిత మహాత్మాగాంధీనుద్దేశించి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గాంధీజీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను అమిత్‌షాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

06/11/2017 - 03:29

చెన్నై, జూన్ 10: దేశంలో బిజెపి మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని, తమది నిజాయితీ గల ప్రభుత్వం అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ‘‘ఇంతకుముందు భూముల స్కాం, బొగ్గు స్కాం, కామన్‌వెల్త్ స్కాం, అంతరిక్ష స్కాంట్లా స్కాంలతోనే ప్రభుత్వం నడిచింది. బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఢిల్లీలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశుభ్రం చేశాం’’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Pages