S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/11/2017 - 03:27

శ్రీనగర్, జూన్ 10: జమ్ము-కాశ్మీర్ సరిహద్దులో చొరబడేందుకు ప్రయత్నించిన ఒక మిలిటెంట్‌ను భద్రతా దళాలు కాల్చిచంపాయి. బండిపోర జిల్లా గురేజ్ సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని అడ్డుకోవడంతో కాల్పులు జరిపాడు. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు.

06/11/2017 - 03:27

న్యూఢిల్లీ, జూన్ 10: బీడీలపై విధించిన జిఎస్టీ పన్నును తొలగించాలని అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్‌ను కలిసి బీడీలపై విధించిన జిఎస్టీని తొలగించాలని వినతిపత్రం అందజేశారు. బీడీ పరిశ్రమపై ఆధారపడి బతుకున్న వారిలో 99 శాతం మంది మహిళలేనని, వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.

06/11/2017 - 03:24

డెహ్రాడూన్, జూన్ 10: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయానికి భక్తులను తీసుకువెళుతున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఇంజనీర్ ఒకరు మృతిచెందగా, పైలట్లిద్దరూ గాయాలతో బయటపడ్డారు. హరిద్వార్ నుంచి బద్రీనాథ్‌కు వెళ్తున్న ఈ కాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులూ క్షేమంగా ఉన్నారు. చనిపోయిన ఇంజనీర్‌ను అస్సాంకు చెందిన విక్రమ్ లాంబాగా గుర్తించామని చమోలి ఎస్పీ తృప్తి భట్ తెలిపారు.

06/11/2017 - 02:28

న్యూఢిల్లీ, జూన్ 10: జూలై 1నుంచి ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌తో పాన్ లింకేజి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. ఆదాయం పన్ను రిటర్న్‌లకు ఆధార్ తప్పనిసరేనని పన్ను వ్యవహారాలను చూసే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు( సిబిడిటి) స్పష్టం చేసింది.

06/10/2017 - 02:59

న్యూఢిల్లీ, జూన్ 9: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తెతో సెల్ఫీ (సెల్ఫీ విత్ డాటర్) మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. అమ్మాయిలు వద్దంటూ భ్రూణహత్యలకు పాల్పడుతున్న వారిలో చైతన్యం తీసుకురావడం ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెలతో సెల్ఫీలు దిగి వాటిని అప్‌లోడ్ చేయాలని కోరారు.

06/10/2017 - 02:57

జైపూర్, జూన్ 9: సరిహద్దు భద్రత గతంలోకన్నా ఇప్పుడు మరింత పటిష్ఠంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అక్రమ చొరబాట్లను ఆపటానికి సరిహద్దులను మరింత పటిష్ఠపరుస్తామని కూడా ఆయన చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మోదీ ఫెస్ట్’ కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ‘గతంతో పోలిస్తే భారత దేశ సరిహద్దులు ఇప్పుడు మరింత సురక్షితంగా, భద్రంగా ఉన్నాయి.

06/10/2017 - 02:56

రాయ్‌పూర్, జూన్ 9: పరిశ్రమలతో సమానస్థాయిలో గ్రామాలనూ అభివృద్ధి చేయవచ్చని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రుజువు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ మూడేళ్ల పాలనలో మచ్చలేని పారదర్శక పాలన అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు.

06/10/2017 - 02:54

మందసౌర్, జూన్ 9: రైతుల ఆందోళనలతో అట్టుడుగుతున్న మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలోని బడవాన్ గ్రామంలో 26 ఏళ్ల యువ రైతు అనుమానాస్పద స్థితిలో మరణించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లనే అతను చనిపోయాడని స్థానికులు శుక్రవారం ఆరోపించారు.

06/10/2017 - 02:51

జైపూర్, జూన్ 9: రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి, 2022 నాటికి వారి రాబడిని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం యత్నిస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌సహా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

06/10/2017 - 02:50

న్యూఢిల్లీ, జూన్ 9: బొగ్గు కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చత్తీస్‌గఢ్‌లో సుమారు 206 కోట్ల విలువైన ఒక స్టీల్‌ప్లాంట్‌ను, దాని మిషనరీని జప్తు చేసింది. బిలాస్‌పూర్ జిల్లాలోని దగోరి అపాంతంలో ఉన్న ఈ స్టీల్‌ప్లాంట్ జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందినదిగా గుర్తించినట్లు ఇడి తెలియజేసింది.

Pages