S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/10/2017 - 02:49

జమ్మూ విమానాశ్రయంలో శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. 134 మంది ప్రయాణికులతో ఢిల్లీనుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 12.15 గంటలకు జమ్మూ ఎయిర్‌పోర్టులో లాండ్ అవుతున్న సమయంలో బ్రేక్ ఫెయిలవడంతో రన్‌వేను దాటి పోయి చివర్లో ఆగిపోయింది. బ్రేక్ ఫెయిలయిన సమయంలోనే విమానానికి చెందిన నాలుగు టైర్లు కూడా పేలిపోవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

06/10/2017 - 02:47

భోపాల్, జూన్ 9: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో వారి సమస్యలను స్వయంగా వినేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నిరశన కార్యక్రమం జరుపబోతున్నారు. రాష్ట్ర రాజధానిలోని దసరా మైదానంలో జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా రైతుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తారు.

06/10/2017 - 02:46

న్యూఢిల్లీ, జూన్ 9: రైతుల నిరసనలకు సంబంధించి పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్‌కు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఆందోళనలకు దిగిన రైతులపై జరిగిన పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేసింది.

06/10/2017 - 02:32

న్యూఢిల్లీ, జూన్ 9: తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా న్యాయమూర్తుల అర్హత పరీక్షను సివిల్ జడ్జీలు రాసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఏపీ, తెలంగాణల్లో జిల్లా న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి ఉమ్మడి హైకోర్టు ఏప్రిల్ 15ననోటిఫికేషన్ విడుదల చేస్తూ, శిక్షణ న్యాయవాదులకు మాత్రమే పరీక్షకు అర్హులుగా పేర్కొంది. దీనిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 40 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

06/10/2017 - 02:09

న్యూఢిల్లీ, జూన్ 9: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి శుక్రవారం ఉదయం హిమాచల్‌ప్రదేశ్ మనాలీ సమీపంలోని కులు లోయలో గుండెపోటుతో కన్నుమూశారు. గోవర్దన్ రెడ్డి రాజ్యసభ స్టాండింగ్ కమిటీ పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం కులు లోయలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు.

06/10/2017 - 01:44

న్యూఢిల్లీ, జూన్ 9: పాన్‌కార్డుల జారీకి, అలాగే ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఆదాయం పన్ను చట్టంలో చేర్చిన నిబంధనను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. అయి తే ప్రైవసీ హక్కు అంశంపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే దాకా దాని అమలును పాక్షికంగా నిలిపివేసింది.

06/09/2017 - 02:48

ముంబయి, జూన్ 8: మధ్యప్రదేశ్‌లో రైతులను కొన్ని శక్తులు రెచ్చగొడుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ‘రైతుల నిరసనలకు సంబంధించినంతవరకు భద్రతా దళాలు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. అయితే కొన్ని శక్తులు మధ్యప్రదేశ్‌లో రైతులను రెచ్చగొడుతున్నాయని తెలుస్తోంది.

06/09/2017 - 02:47

న్యూఢిల్లీ, జూన్ 8: ‘ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. సాయం చేయడానికి సిద్ధం’ అంటూ స్పందించే వారిలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అందరికన్నా ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆమె సోషల్ మీడియా ద్వారా వచ్చిన అభ్యర్థనకు సైతం స్పందించి వారిని ఆకట్టుకున్నారు కూడా. ‘నా బిడ్డకు ఆపరేషన్ చేయించడానికి భారత్‌కు తీసుకు రావాలి.

06/09/2017 - 02:47

న్యూఢిల్లీ, జూన్ 8: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టినట్లు తెలిసింది. బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు స్థానిక బి.జె.పి నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాల మూలంగానే ఎన్.డి. ఏ ప్రభుత్వం శాసన సభల సీట్లు పెంచే ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసిందనే మాట వినిపిస్తోంది.

06/09/2017 - 02:46

చిత్రాలు... మధ్యప్రదేశ్ పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం మందసౌర్‌కు వచ్చిన రాహుల్‌ను అడ్డుకుంటున్న పోలీసు బలగాలు.
*రాహుల్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా ఉజ్జయనిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌కార్యకర్తలు.
*మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీసు కాల్పులకు నిరసనగా త్రిపురలో ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు

Pages