S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/01/2017 - 04:04

బెంగళూరు, మే 31: దేశవ్యాప్తంగా ఎన్నికల ఓటింగ్ యంత్రాల నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిని తయారు చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ చాలా స్పష్టమైన రీతిలోనే ఒక ప్రకటన చేసింది. ఇవిఎంలు అత్యంత సురక్షితమైనవని, వీటిని ట్యాంపర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేసింది.

06/01/2017 - 03:02

న్యూఢిల్లీ, మే 31: భారతీయుల తలసరి ఆదాయం 2016-17లో 9.7 శాతం పెరిగి 1,03,219 రూపాయలకు చేరుకుంది. అంతకుముందు నమోదైన తలసరి ఆదాయం 94,130 రూపాయలు. 2015-16లో తలసరి ఆదాయం పెరుగుదల 7.4 శాతంగా నమోదైందని ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ధరల ప్రకారం లెక్కగడితే తలసరి ఆదాయం లక్ష దాటిందని వివరించింది.

06/01/2017 - 01:36

జైపూర్ / తిరువనంతపురం, చెన్నై, మే 31: దేశవ్యాప్తంగా గోవధకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆందోళనలు, పశు విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి ఈ మూగ జీవిని జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. అలాగే గో వధకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని రాష్ట్ర బిజెపి సర్కార్‌కు స్పష్టం చేశారు.

05/31/2017 - 08:57

పవిత్ర అమర్‌నాథ్ పర్వత సాణువుల్లో మంగళవారం మంచు శివలింగం ఇలా దర్శనమిచ్చింది. ఈ సీజన్‌లో తీసిన మొట్టమొదటి చిత్రం ఇదే.

05/31/2017 - 08:55

న్యూఢిల్లీ, మే 30: నైరుతి రుతుపవనాలు మామూలుకన్నా రెండు రోజులు ముందే మంగళవారం కేరళ, ఈశాన్య భారతాన్ని తాకాయి. మంగళవారం బంగ్లాదేశ్ తీరాన్ని తాకిన ‘మోరా’ తుపాను రుతుపువనాల పురోగతికి దోహదం చేసినట్లు భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ కె జె రమేశ్ చెప్పారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల రైతులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే వార్తేనని చెప్పాలి.

05/31/2017 - 08:54

మదురై, మే 30: కబేళాల కోసం పశువుల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను మద్రాసు హైకోర్టు మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసింది. నాలుగు వారాలపాటు స్టే కొనసాగుతుందని పేర్కొన్న కోర్టు, ఆలోగా తమ సమాధానాలను తెలియజేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాను ఏం తినాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉంది అని కోర్టు వ్యాఖ్యానించింది.

05/31/2017 - 08:52

లక్నో, మే 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతి సహా మొత్తం 12మందిపై స్థానిక సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. 2001లో వీరిపై ట్రయల్ కోర్టు క్రిమినల్ కుట్ర అభియోగాలను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది. 2010లో అలహాబాద్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.

05/31/2017 - 08:40

న్యూఢిల్లీ, మే 30: సౌదీ అరేబియాలో ఓ స్థానికుడికి అమ్మేసిన, చిత్రహింసలకు గురవుతున్న 55 ఏళ్ల భారత మహిళ బుధవారం స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలియజేశారు.‘ ఈ విషయాన్ని సకాలంలో నా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు. సుఖ్వంత్ కౌర్ బుధవారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఇంటికి తిరిగి వస్తున్నారు’ అని సుష్మ ఒక ట్వీట్‌లో తెలియజేశారు.

05/30/2017 - 07:57

బెంగళూరు, మే 29: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పన్ను ఎగవేతలను నిరోధించడానికే కాకుండా భారత్ మరింతగా పన్నులను అంగీకరించే సమాజంగా పరివర్తన చెందడానికి దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) కొత్త క్యాంపస్‌ను సోమవారం ఇక్కడ జైట్లీ ప్రారంభించారు.

05/30/2017 - 07:53

బెర్లిన్, మే 29: అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఐరోపా గురుతర పాత్ర పోషించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాలుగా ఉగ్రవాదాన్ని అభివర్ణించిన ఆయన, ఈ విషయంలో ఐరోపా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జర్మనీ పత్రిక హాండెల్ బ్లాట్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఇరు దేశాలకు సంబంధించిన అనేక అంశాలను అంతర్జాతీయ, ప్రాంతీయ సవాళ్లను ఆయన ప్రస్తావించారు.

Pages