S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/29/2017 - 01:33

లాహోర్, మే 28: కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను వెంటనే అమలు చేయాలని కోరుతూ పాకిస్తాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఒకవేళ ఈ శిక్షను వెంటనే అమలు చేయకపోతే, దానిని రద్దు చేసే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ముజామిల్ అలీ తరపున మాజీ సెనేట్ చైర్మన్, అడ్వకేట్ ఫరూక్ నాయెక్ శనివారం ఈ పిటిషన్ దాఖలు చేశారు.

05/28/2017 - 05:08

కాశ్మీర్‌లో రెండు భారీ ఎన్‌కౌంటర్లు
బుర్హాన్ వనీ వారసుడు హతం
మొత్తం 8మంది మిలిటెంట్లు మృతి
లోయలో అల్లర్లు, ఒకరి మృతి
ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత

05/28/2017 - 05:06

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం సమావేశమై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్షాల కూటమిని ఝలక్ ఇచ్చారు. రాష్టప్రతి ఎన్నికలకు సంబంధించి ఇద్దరి మధ్య మద్దతు చర్చలు సాగాయన్న ఊహాగానాలు దేశంలో కొత్త రాజకీయానికి సంకేతంగానే కనిపిస్తోంది. నిజానికి బిహార్ సిఎం నితీష్‌కుమార్‌కు దేశ రాజకీయాల్లోనే ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయాల్లో ఆయన చాణక్యుడు లాంటివారన్న పేరుంది.

05/27/2017 - 07:51

నా వ్యాఖ్యలకు కట్టుబడివున్నా

అబద్ధాలనుకుంటే నిరూపించండి
కెసిఆర్‌కు అమిత్ షా సవాలు

05/27/2017 - 07:43

వ్యవసాయ అవసరాలకే పరిమితం
కొనుగోలుదారుల
హామీప్రతం తప్పనిసరి

05/27/2017 - 07:37

న్యూఢిల్లీ, మే 26: ఎన్నికల కమిషన్ జూన్ 3న నిర్వహించే ఇవిఎంల చాలెంజ్‌లో కేవలం శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మాత్రమే పాల్గొంటోంది. ఆమ్ ఆద్మీ, బిఎస్పీ సహా పలు పార్టీలు చేసిన ఇవిఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను తిప్పికొట్టడానికి ఇసి ప్రకటించిన ఇవిఎంల చాలెంజ్ జూన్ 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య జరుగనుంది.

05/27/2017 - 07:36

న్యూఢిల్లీ, మే 26: పంజాబ్ మాజీ డీజీపీ కెపిఎస్ గిల్ శుక్రవారం కన్నుమూశారు. మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్టు ఆస్పత్రి నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ రాణా ఒక ప్రకటనలో తెలిపారు. గిల్ వయస్సు 82 ఏళ్లు.

05/27/2017 - 07:36

దేశంలోకి చొరబడిన
20మంది మిలిటెంట్లు
ఇంటెలిజన్స్ ఏజన్సీల హెచ్చరిక
యురి సరిహద్దుల్లో
ఇద్దరు పాక్ సైనికులు హతం

05/27/2017 - 07:35

అన్ని విషయాల్లోనూ సమర్థించారు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గను ప్రతిరోజూ ఓ నవోదయమే
అన్ని రంగాల్లోనూ ఆశావాదం మాటలతో అభివృద్ధి జరగదు అసోం ర్యాలీలో ప్రధాని మోదీ ఉద్ఘాటన

05/26/2017 - 08:13

ముంబయి, మే 25: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు గురువారం ఘోరప్రమాదంనుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లాతూర్ సమీపంలోని నీలంగ ప్రాంతంలో కిందికి దిగే సమయంలో హెలికాప్టర్ పైనున్న తీగల్లో చిక్కుకుపోయి కూలిపోయింది.

Pages