S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/26/2017 - 05:44

న్యూఢిల్లీ, మే 25: కాశ్మీర్ వేర్పాటువాదులతో ప్రస్తుతానికి చర్చలు జరిపే ప్రసక్తి లేదని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా తెలియజేశారు. హింసాకాండను రెచ్చగొడుతున్న వేర్పాటువాదులతో చర్చల ఊసే ఉండదని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదని వివరించారు. అయితే సమస్య పరిష్కారంలో భాగంగా కాశ్మీర్ ప్రజలతో మాట్లాడతామని, వారి ఇబ్బందుల్ని కచ్చితంగా తీరుస్తామని అన్నారు.

05/26/2017 - 05:41

లక్నో, మే 25: బాబరీ మసీదు విధ్వంసం కేసులో కుట్రపరమైన అభియోగాలు ఎదుర్కొంటున్న బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిలు ఈ నెల 30 జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని లక్నో కోర్టు గురువారం నిర్ద్వంద్వంగా తెలిపింది. వ్యక్తిగత హాజరీ విషయంలో వీరికి ఎలాంటి మినహాయింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

05/26/2017 - 05:16

న్యూఢిల్లీ, మే 25: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత కమ్ ప్రవేశపరీక్ష (నీట్)ను మళ్లీ తాజాగా నిర్వహించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

05/25/2017 - 07:06

ఇస్లామాబాద్, మే 24: భారత్, పాకిస్తాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వాయుసేన చీఫ్ మరింత ఆజ్యం పోశారు. ‘శత్రువు భావితరాలు కూడా మరచిపోని రీతిలో ఎదురుదెబ్బ తీస్తాం’ అని పాక్ ఎయిర్‌చీఫ్ మార్షల్ సొహైల్ అమన్ బుధవారం తీవ్రస్థాయిలో స్పందించారు.

05/25/2017 - 01:02

లక్నో, మే 24: పదిహేనేళ్లనాటి బాబరీ మసీదు విధ్వంసం ఘటనలో కుట్ర కేసుకు సంబంధించి బిజెపి సీనియర్ నేతలు ఎల్‌కె అద్వానీ తదితరులపై సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం అదనపు అభియోగాలు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీరిపై దాఖలైన కుట్ర కేసు దర్యాప్తును పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

05/25/2017 - 00:55

న్యూఢిల్లీ, మే 24: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తేల్చాల్సిన బాధ్యత సుప్రీం కోర్టుదేనని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ ఉద్ఘాటించారు. ఈ అంశంపై చట్టాన్ని చేసే పూర్తి అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ వౌలికంగా ఇది రాజ్యాంగ సమ్మతమా, విరుద్ధమా అన్న విషయాన్ని తేల్చాల్సింది సర్వోన్నత న్యాయస్థానమేనని ఆయన ఆన్నారు.

05/24/2017 - 05:20

న్యూఢిల్లీ, మే 23: జేమ్స్‌బాండ్ పాత్రలో సినీ అభిమానులను అలరించిన అలనాటి నటుడు రోజర్ మూర్ మంగళవారం కన్నుమూశారు. 89ఏళ్ల మూర్ దీర్ఘకాలంగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నా రు. మంగళవారం స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచినట్టు ఆయన సంతానం ఒక ప్రకటనలో వెల్లడించారు. నాలుగుసార్లు వివాహం చేసుకున్న ఆయనకు కుమార్తె, ఇద్దరు కుమారులు, భార్య క్రిస్టినా థొల్‌స్ట్రప్ ఉన్నారు.

05/24/2017 - 05:19

ఐఎండి అంచనాలకు
రోజు ముందే తాకే అవకాశం

05/24/2017 - 05:18

ఉత్తరకాశి, మే 23: ఉత్తరాఖండ్‌లో మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో 22మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణం చేస్తున్న బస్సు సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో నాలుపానీ సమీపంలోని భగీరథి నదిలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన చార్‌దామ్ యాత్రికులేనని గంగోత్రి నుంచి హరిద్వార్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

05/24/2017 - 05:09

న్యూఢిల్లీ, మే 23: పాకిస్తాన్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. బాంబుల దాడితో జమ్మూ కాశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ ఆవల నౌషేరా సెక్టార్‌లో పాక్ బంకర్ పోస్టులను ధ్వంసం చేసింది. భారత్ బాంబుల ధాటికి పాక్ బంకర్లు నామరూపాల్లేకుండా పోయాయి. జమ్మూ కాశ్మీర్‌లోకి ఇస్లామిక్ ఉగ్రవాదులను పంపుతూ, సైనిక శిబిరాలపై దాడులకు పాల్పడుతున్న పాక్‌కు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం ప్రత్యక్ష దాడులకు దిగింది.

Pages