S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/20/2017 - 00:11

న్యూఢిల్లీ, మే 19: దమ్ముంటే ఈవిఎంలను ట్యాంపర్ చేసి చూపించాలంటూ సవాల్ విసిరిన కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఇందుకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ విలేఖరుల సమావేశంలో ‘ఈవిఎంల ట్యాంపరింగ్’ షెడ్యూలును ప్రకటించనున్నారు. విజ్ఞాన్‌భవన్‌లో శనివారం గంటన్నర పాటు ఈవిఎంలు, వివిపిఏటిలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రదర్శించబోతోంది.

05/20/2017 - 00:09

కోల్‌కతా, మే 19: దేశ ఆరోగ్య రంగంలో హోమియోపతి, భారతీయ వైద్య వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శుక్రవారం ఉదయం ఇక్కడి సైన్స్ సిటీ ఆడిటోరియంలో హోమియోపతి పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ అలోపతి వైద్యంతో పోలిస్తే హోమియోపతి, భారతీయ వైద్యం చౌకగా లభించడంతో పాటు వీటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేకపోవడం వల్ల ఎక్కువ ప్రజాదరణ పొందాయని అన్నారు.

05/20/2017 - 00:08

చెన్నై, మే 19: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో ఇప్పుడు ఊహాగానాలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ వారం ప్రారంభంలో తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమైన రజనీకాంత్ తొలి రోజే తన రాజకీయ ప్రవేశంపై ఒక విధంగా స్పష్టత ఇచ్చారు కూడా. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అంటూనే ఒక వేళ భగవంతుడి నిర్ణయం అదే అయితే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

05/20/2017 - 00:03

న్యూఢిల్లీ, మే 19: ఎఐఎడిఎంకె కార్యాలయాన్ని ఉపయోగించుకోకుండా వికె.శశికళ వర్గాన్ని నిలువరించాలని కోరుతూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపిఎస్) వర్గం శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి)ను ఆశ్రయించింది.

05/20/2017 - 00:00

ఇస్లామాబాద్, మే 19: కులభూషణ్ జాధవ్ కేసు విషయంలో పాక్ పాలకుల వైఖరి కారణంగానే అంతర్జాతీయ న్యాయ స్థానంముందు దేశం పరువు పోయిందని ఆ దేశంలోని న్యాయ నిపుణులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం మండిపడుతున్నారు.

05/19/2017 - 09:00

న్యూఢిల్లీ, మే 18: ముస్లింలు పాటించే ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ బద్దతపై తీర్పును సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఆరు రోజుల పాటు ఈ అంశంపై విచారణ జరిపింది. జూలైలో తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

05/19/2017 - 04:35

ఇస్లామాబాద్, మే 18: తమ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికార పరిధి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంత మాత్రం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. గూఢచర్య నేరాలపై జాధవ్‌కు మరణ శిక్ష అమలును తదుపరి ఉత్తర్వుల వరకూ నిలిపివేస్తూ ఐసిజె తీర్పు నివ్వడంతో నిర్ఘాంత పోయిన పాక్ తన అక్కసును చాటుకుంది. తమ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల్లో ఐసిజె అధికార పరిధిని తాము అంగీకరించడం లేదని తెలిపింది.

05/19/2017 - 04:35

ది హేగ్,మే 18: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు విధించిన మరణ శిక్ష విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తొలి విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చుక్కెదురైంది. ఈ కేసును పూర్తిగా విచారించి తుది ఆదేశాలు జారీ చేసే వరకూ జాధవ్‌కు మరణ శిక్ష విధించడానికి వీల్లేదని అంతర్జాతీయ కోర్టు ఏకగ్రీవంగా పాకిస్తాన్‌ను ఆదేశించింది.

05/19/2017 - 04:33

న్యూఢిల్లీ, మే 18: కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే గురువారం హఠాత్తుగా మృతి చెందారు. ఆయనకు 60 ఏళ్లు. గురువారం ఉదయం అనారోగ్యంగా ఉన్న ట్లు దవే చెప్పడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడ మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దవే 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

05/19/2017 - 04:32

న్యూఢిల్లీ, మే 18: అణ్వాయుధాలను నిల్వ చేయడం కోసం పాకిస్తాన్ రహస్యంగా నిర్మిస్తున్న స్థావరం గుట్టు రట్టయింది. ఖైబర్ ఫక్తూన్ ఖ్వా రాష్ట్రంలోని హరిపూర్ పీర్‌థాన్ పర్వత శ్రేణుల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్థావరం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఉపగ్రహ చిత్రాల ఆదారంగా మిలిటరీ ఇంటెలిజన్స్ వర్గాలు ఈ స్థావరాన్ని గుర్తించగలిగాయి.

Pages