S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/23/2017 - 02:29

ఢిల్లీని శనివారం గాలిదుమారం అతలాకుతలం చేసింది. అనేక ప్రాంతాలను పెద్దఎత్తున దుమ్ము తుపాను కమ్మేయడంతో జనం భీతావహులయ్యారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

04/23/2017 - 02:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపిని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఐక్యతారాగం అందుకుంది. దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనాన్ని అడ్డుకుని, ఎన్డీయే మిత్రపక్షాల దూకుడు తగ్గించాలంటే ప్రతిపక్షాల ఐక్యత ఒక్కటే మార్గమని భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా పావులు కదుపుతున్నారు.

04/23/2017 - 02:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం రాష్టప్రతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పదిహేనేళ్ల విజన్ డాక్యుమెంట్‌పై చర్చించి కార్యచరణ రూపొందించనున్నారు.

04/23/2017 - 01:58

చిత్రం..ధరిత్రీ దినోత్సవం సందర్భంగా శనివారం జబల్‌పూర్‌లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ముఖాలపై రంగులు అద్దుకుని పుడమిని రక్షించుకుందాం అంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం

04/23/2017 - 01:41

కరాచీ, ఏప్రిల్ 22: ప్రపంచంలోని అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన అల్‌ఖైదా నాయకుడు అల్ జవహరి ప్రస్తుతం కరాచీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అతనికి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు అమెరికా మీడియాలో వచ్చిన కథనం స్పష్టం చేస్తోంది.

04/23/2017 - 01:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తనపై ప్రతిరోజూ ఒక తూటా పేలుస్తున్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 31న బైజాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తర్వాత కేజ్రివాల్ ఆయనపై నేరుగా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.

04/23/2017 - 01:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ బోగీలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో లాంగ్ డిస్టెన్స్ (ఎక్కువ దూరం ప్రయాణించే) రైళ్లలో థర్డ్‌క్లాస్ ఏసీ బోగీల సంఖ్యను పెంచనున్నారు.

04/23/2017 - 01:39

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి ఊపుమీదున్న బిజెపి మన్ముందు అదే దూకుడును కొనసాగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే 13 మంది బిజెపి ముఖ్యమంత్రుల సమావేశం కీలకం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రసంగించనున్నారు. ‘సుపరిపాలన-అభివృద్ధి’ అజెండాగా సిఎంలకు మోదీ మార్గనిర్దేశం చేయనున్నారు.

04/23/2017 - 01:39

శ్రీనగర్, ఏప్రిల్ 22: జమ్మూ, కాశ్మీర్‌లోని రేసి జిల్లాలో గోరక్షకులుగా చెప్పుకొంటున్న కొంతమంది జరిపిన దాడిలో తొమ్మిదేళ్ల బాలికసహా ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. తల్వారా ఏరియా సమీపంలో సంచార జాతికి చెందిన వీరంతా తమ పశువులతో వెళ్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో గోరక్షకుల గుంపు ఐరన్ రాడ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా కొట్టారు.

04/22/2017 - 03:49

ఇక న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: వాహన దారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూల్లో నిలబడ్డనక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ హోమ్ డెలివరీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Pages