S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/16/2017 - 09:49

మంటల్లో చెత్త డంప్.. వందకు పైగా ఇళ్లు బుగ్గి

మృతుల్లో నలుగురు చిన్నారులు శ్రీలంకలో దుర్ఘటన
600 మంది సురక్షిత ప్రాంతాలకు పరారీ
బాధితులకు క్షమాపణ చెప్పిన ప్రధాని

04/16/2017 - 07:56

వైరీ (మహారాష్ట్ర), ఏప్రిల్ 15: కర్ణాటక నుంచి మహారాష్టక్రు పిక్నిక్ కోసం వచ్చిన ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఎనిమిది మంది శనివారం సముద్రంలో మునిగి చనిపోయారు. సింధుదుర్గ్ జిల్లాలోని వైరీ తీరంలో అరేబియా మహాసముద్రంలోకి దిగిన వీరు నీట మునిగి చనిపోయారని పోలీసులు చెప్పారు. బెల్గాంలోని మరాఠా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 47 మందిలో 30 మంది ఈతకోసం సముద్రంలోకి దిగారు.

04/16/2017 - 07:55

పనాజి, ఏప్రిల్ 15: కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్ష విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టిన మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ‘ఓటి కుండకు మోతెక్కువ’ అన్న తీరులో పాక్ వ్యవహరిస్తోందని, దాన్ని మనం పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు.‘ కొంకణి, హిందీభాషల్లో ఒక సామెత ఉంది. ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి అనేది దాని అర్థం.

04/16/2017 - 07:39

విశాఖపట్నం, ఏప్రిల్ 15: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నప్పటికీ రానున్న రెండు రోజుల్లో ఇది మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశీలకులు అంచనావేస్తున్నారు.

04/16/2017 - 06:35

అన్ని రాష్ట్రాల్లో కమల వికాసం
సాధించిన విజయాలతో సంతృప్తి వద్దు
భావి లక్ష్యాల సాధనే కీలకం
బిజెపి కార్యనిర్వాహక భేటీలో అమిత్ షా పిలుపు
జనంలోకి మోదీ.. రోడ్ షో గ్రాండ్ సక్సెస్
మార్గమంతా నినాదాల జోరు

04/16/2017 - 06:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగిలిస్తున్న నేపథ్యంలో వచ్చేవారం పాకిస్తాన్‌తో జరగనున్న తీర ప్రాంత రక్షణ దళాల చర్చలను భారత్ రద్దు చేసుకుంది. ఈ నెల 16, 19 తేదీల్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ తీరప్రాంత భద్రతా ఏజెన్సీ (ఎంఎస్‌ఏ) సారథ్యంలో ప్రతినిధుల బృందం భారత్‌కు రావాల్సి వుంది.

04/15/2017 - 04:09

చిత్రం..గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం జబల్‌పూరలో శిలువ ఊరేగింపు నిర్వహించిన క్రైస్తవ మతస్థులు

04/15/2017 - 02:42

లక్నో, ఏప్రిల్ 14: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల టాంపరింగ్‌పై మాట్లాడుతున్నందుకే బిజెపి తనను టార్గెట్ చేస్తోందని బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ఇవిఎంల టాంపరింగ్ అంశంపై బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలపడానికి తాను సిద్ధమేనని కూడా ఆమె ప్రకటించారు.

04/15/2017 - 02:41

చిత్రం..అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బిజెపి సీనియర్ నేత అద్వానీ
కాలి బూటును సరిచేస్తున్న ఆయన కార్యదర్శి దీపక్ చోప్రా

04/15/2017 - 02:53

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్టప్రతి, ప్రధాని ప్రభృతులు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. పార్లమెంటు భవనం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Pages