S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/12/2017 - 04:09

లక్నో, ఏప్రిల్ 11: నవరాత్రి సందర్భంగా అన్ని శక్తిపీఠాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను దిగ్విజయంగా అమలుచేసిన యూపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం అన్ని జిల్లా కేంద్రాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్రామాలకు 18 గంటలు విద్యుత్ సరఫరా చేస్తారు.

04/12/2017 - 02:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ విద్యార్థులకు న్యూసౌత్‌వేల్స్ యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా టిఆర్‌ఎస్ ఎంపీ కవితతో ఆస్ట్రేలియా ప్రతినిధులు చర్చలు జరిపారు. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నటుల్‌తో పాటు మన దేశానికి వచ్చిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగళవారం ఎంపీ కవితతో భేటీ అయింది.

04/12/2017 - 02:07

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఏపీలో మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మంగళవారం పార్లమెంట్‌లోని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కార్యాలయంలో మిర్చి రైతుల సమస్యలపై మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్‌లతో ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు చర్చలు జరిపారు.

04/12/2017 - 01:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారత్‌లోని అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై అమెరికా జాతీయ భద్రతా ఏజెన్నీ (నాసా) నిఘా పెట్టిందని వికీ లీక్స్ స్పష్టం చేసింది. బిజెపితో పాటు పాకిస్తాన్‌కు చెందిన పిపిపి పార్టీపైనా నిఘా కార్యకలాపాలను కొనసాగిస్తోందంటూ వికీలీక్స్‌ను ఉటంకిస్తూ మంగళవారం కథనాలు వెలువడ్డాయి.

04/12/2017 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌పై చేసిన ఆరోపణలన్నీ కట్టుకథలంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన్ని గూఢచారిగా పేర్కొంటూ విధించిన ఉరి శిక్షను అమలు చేస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలూ మంగళవారం దద్దరిల్లిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు.

04/12/2017 - 01:36

లక్నో, ఏప్రిల్ 11: ఏడాదిన్నర కాలంలోనే ట్రిపుల్ తలాక్‌కు స్వస్తి పలుకుతామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డు ఉపాధ్యక్షుడు సరుూద్ సాదిక్ ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఉద్ఘాటించారు.

04/12/2017 - 01:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్ సహా ఏ ఇతర రాష్ట్రానికీ ఇకపై ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యంకాదని కేంద్ర ప్రణాలిక, పట్టణాభివృద్ధి మంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఇచ్చిన సావధాన తీర్మానానికి సమాధానమిస్తూ 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు అమలు చేయటం ద్వారా ఆంధ్రకు ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలు కలిగిస్తున్నట్టు బదులిచ్చారు.

04/12/2017 - 00:02

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యాత్వంలాంటి ఆచారాలు ముస్లిం మహిళల సామాజిక హోదా, వారి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నాయని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను వారికి దక్కకుండా చేస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

04/11/2017 - 03:10

న్యూఢిల్లీలో సోమవారం రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీజీకి
పుష్పాంజలి ఘటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టర్న్‌బుల్

04/11/2017 - 03:06

చెన్నై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తమిళనాడులో రాధాకృష్ణన్ నగర్ (ఆర్‌కె.నగర్) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ (ఇసి) తీసుకున్న నిర్ణయాన్ని అధికార ఎఐఎడిఎంకె అభ్యర్థి, ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి.దినకరన్ తప్పుబట్టారు. ఇది తప్పుడు నిర్ణయమని, ఆర్‌కె.నగర్‌లో తాను విజయం సాధించడం ఎన్నికల కమిషన్‌కు కూడా ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు.

Pages