S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/11/2017 - 01:14

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిబిఐ, ఇడిలను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్షసాధించపుచర్యలకు పాల్పడుతోందని విపక్ష పార్టీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించాయి. బిజెపియేతర పార్టీల ముఖ్యమంత్రుల, మాజీ సిఎంలు, నాయకులపై సిబిఐ,ఇడిలను ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు రాజ్యసభ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది.

04/11/2017 - 01:13

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ ఆలోచన విరమించుకోవాలని కేంద్రానికి మాలమహానాడు విజ్ఞప్తి చేసింది. సోమవారం నాడు మాల మహానాడు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కలసి విజ్ఞప్తి చేసింది. ఎస్సీ వర్గీరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కేంద్రమంత్రిని కోరారు.

04/11/2017 - 01:13

శ్రీనగర్, ఏప్రిల్ 10: అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నికను ఎనికల కమిషన్ వాయదా వేసింది. ఈ నియోజకవర్గ పరిధిలోని బద్గావ్, గండేర్‌బాల్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు తలెత్తడంతో సోమవారం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఉప ఎన్నికను మే 25వ తేదీకి వాయదా వేశారు. ఈ ఉప ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన రెండు పోలింగ్‌బూత్‌లకు ఆందోళకారులు నిప్పుపెట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి.

04/11/2017 - 01:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్‌లో వేసిన అంచనా ప్రకారం అయ్యే నీటిపారుదల ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుంది, అంచనాకు మించి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు అడిగిన మూల ప్రశ్నకు ఉమాభారతి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇస్తూ ఈ విషయం స్పష్టం చేశారు.

04/11/2017 - 01:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఏపి పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 10లో పేర్కొన్న సంస్థలను విభజనలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తెరాస ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెరాస ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బీబీ పాటిల్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

04/11/2017 - 01:10

భోపాల్, ఏప్రిల్ 10: మధ్యప్రదేశ్ సంపూర్ణ మద్యనిషేధం దిశగా సాగబోతున్నది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గల అన్ని మద్యం షాపులను దశలవారీగా మూసివేస్తామని ఆయన ప్రకటించారు.

04/10/2017 - 02:40

చెన్నై, ఏప్రిల్ 9: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బిజీగా ఉండే అన్నాసాలై (వౌంట్ రోడ్డు)లోని జెమిని బస్‌స్టాప్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఒక సిటీ బస్సు, మరో కారు గోతిలో దిగబడి పోయాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సిటీ బస్సు జెమినీ బస్టాప్ వద్ద ఆగి ఉండగా, కారు దాని పక్కనుంచి వెళ్తోంది.

04/10/2017 - 02:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: సేవలను అందించే సంస్థలతో పోలిస్తే వినియోగదారులే ఎక్కువ ప్రతికూల పరిస్థితుల్లో ఉంటారు గనుక వినియోగదారులకు సంబంధించిన వివాదాల్లో కోర్టులు వినియోగదారుల హక్కుల విషయంలో వాస్తవ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

04/10/2017 - 02:36

శ్రీనగర్, ఏప్రిల్ 9: జమ్మూ-కాశ్మీరులోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆదివారం నిర్వహించిన ఉప ఎన్నిక హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 5.84 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు.

04/10/2017 - 02:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఇవిఎం) వాటిని తయారు చేసిన వారు కూడా ట్యాంపరింగ్ చేయలేరని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇవిఎంల విశ్వసనీయతపై రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇసి ఈ వివరణ ఇచ్చింది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే.

Pages