S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/10/2017 - 02:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తు లు ఆత్మహత్యకు చేసే ప్రయత్నాలు ఇకమీదట శిక్షార్హం కావు. ఇందుకు సంబంధించిన కొత్త చట్టానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. మానసిక అనారోగ్యంతో బా ధపడుతున్న వ్యక్తులకు మత్తుమందు (అనస్థీసియా) లేదా కండరాలకు ఉపశమనమిచ్చే మందులు ఇవ్వకుండా ఎలక్ట్రో-కన్వల్సివ్ చికిత్స (షాక్ థెరపీ) చేయడాన్ని కూడా ఈ చట్టం నిషేధిస్తోంది.

04/10/2017 - 01:56

ఛత్తర్‌పూర్, ఏప్రిల్ 9: మధ్యప్రదేశ్‌లోని ఖజురహో పట్టణంలో ఒక ఆడ శిశువు అత్యంత అరుదైన విధంగా జన్మించింది. ఖజురహో జిల్లా వైద్య కేంద్రంలో ఈ నెల 5వ తేదీన జన్మించిన ఈ శిశువుకు దేహం వెలుపల (్ఛతీ భాగం వెలుపల) గుండె ఉందని, దీంతో ఆ శిశువును చికిత్స నిమిత్తం న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారని ఆదివారం ఒక అధికారి వెల్లడించారు.

04/10/2017 - 01:43

న్యూఢిల్లీ,ఏప్రిల్ 9:తెలంగాణలోని పంచాయతీలకు జాతీయ స్థాయిలో మొత్త 8 అవార్డులు దక్కాయి. కేంద్రం ఉత్తమ పనితీరును కనబరిచిన స్థానిక సంస్థలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పంచాయతీ అవార్డులు 2017 సంవత్సరానికి కేంద్రం ప్రకటించింది.

04/10/2017 - 01:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ ఈ ఏడాది ఫీజులు భారీగా పెరిగిపోయాని తాజాగా జరిగిన ఓ జాతీయ సర్వే స్పష్టం చేస్తోంది. 11 నుంచి 20శాతం వరకూ పెరిగిన ఫీజుల భారంతో తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారని, కొన్ని రాష్ట్రాల్లో అయితే తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు కూడా దిగారని లోకల్ సర్కిల్స్ అనే సామాజిక సంస్థ తెలిపింది.

04/10/2017 - 01:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9:ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ విభాగంలో 12 అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పని తీరును కనబరిచిన స్థానిక సంస్థలకు ప్రతి ఏడాది ఇచ్చే పంచాయతీ అవార్డులను 2017 సంవత్సరానికి ఆదివారం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన జిల్లా పరిషత్‌లు, మండలాలకు,గ్రామ పంచాయితీలకు కేంద్రం నగదు పారి తోషికాన్ని అందజేయనుంది.

04/10/2017 - 01:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రధానమైన సంస్కరణలు, జరిగిన ప్రగతిని ప్రతిబింబింపజేసే సమగ్రమైన డేటాతో పాటుగా, తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు ప్రయోజనం కలిగించిన అయిదు ప్రధానమైన విజయాలను తెలియజేయాలని ప్రభుత్వం కేంద్రమంత్రులందరినీ ఆదేశించింది.

04/10/2017 - 01:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశవ్యాప్తంగా గోవధను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకు రావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ డిమాండ్ చేశారు. అంతేకాదు గోరక్షణ పేరుతో ఎటువంటి హింసకు పాల్పడ్డం సరికాదని ఆయన అన్నారు.

04/10/2017 - 01:28

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశీయ విమాన యానాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దే చర్యలను ప్రభుత్వం వేగంగా చేపడుతోంది. విమానాల్లో ప్రయాణించాలంటే ఆధార్ లేదా పాస్‌పోర్టు తప్పనిసరి పేర్కొంది. అలాగే దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఓ జాబితాను కూడా రూపొందిస్తోంది.

04/10/2017 - 01:25

చిత్రం..ఆదివారం చెన్నైలోని వౌంట్ రోడ్డుపై ఏర్పడ్డ భారీ గొయ్యలోకి
ఆర్టీసీ బస్సు, ఓ కారు దిగబడిపోయన దృశ్యం

04/10/2017 - 00:35

పురూలియా (పశ్చిమబెంగాల్), ఏప్రిల్ 9: దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నరబలి ఇచ్చే సన్నివేశాలను పాతకాలం పౌరాణిక సినిమాలలో చూస్తుంటాం. కాని, ఈ ఆధునిక యుగంలో కాళికాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక యువకుడు తన కన్నతల్లినే బలిచ్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో గల బమగ్రామ్‌లో నారాయణ్ మహతో (35) అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Pages