S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/08/2017 - 07:34

తవాంగ్, ఏప్రిల్ 7: టిబెటన్ల ఆధ్యాత్మి గురువు దలైలామా శుక్రవారం ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో దలైలామా పర్యటన పట్ల చైనా అభ్యంతరాలను లెక్కపెట్టని ఆయన 58 ఏళ్ల క్రితం టిబెట్‌నుంచి భారత్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమం త్రి పేమా ఖందూతో కలిసి ఆయన ఇక్కడికి వచ్చారు. దలైలామా ఈ నెల 4నే తవాంగ్ రావలసి ఉండింది.

04/08/2017 - 06:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆధార్ కార్డును వాహన రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి చేయడం మంచిదేకాని, డ్రైవింగ్ లైసెన్స్‌కు తప్పనిసరి చేయటం సమర్థనీయం కాదని వైకాపా ఎంపీ వి వరప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రసాదరావు శుక్రవారం లోక్‌సభలో వాహన చట్టం సవరణ బిల్లుపై మాట్లాడుతూ వాహన చట్టానికి ప్రతిపాదించిన కొన్ని సవరణలు విప్లవాత్మకమైనవేనని అన్నారు.

04/08/2017 - 06:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7:ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి, వివిధ పార్టీల నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరించింది.

04/08/2017 - 06:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రోడ్డు ప్రమాదాల నుంచి మనుషుల ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా మోటారు వాహన చట్టంలో విప్లవాత్మక మార్పులకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. పెద్దల సభ ఆమోదం కూడా పొందితే చట్టరూపంలోకి వస్తుంది. రోడ్డు ప్రమాదాలను నివారించటం, అకాల మరణాలను నిరోధించటమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా తెలిపారు.

04/08/2017 - 05:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎయిర్ ఇండియా శుక్రవారం ఎత్తివేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఒక అధికారిని గైక్వాడ్ చెప్పుతో కొట్టడంతో సుమారు రెండు వారాల క్రితం ఆయన విమాన ప్రయాణంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

04/07/2017 - 08:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: సహారా గ్రూప్ ఈ నెల 17నాటికి సెబి-సహారా రిఫండ్ అకౌంట్‌లో రూ. 5092.6 కోట్లు డిపాజిట్ చేయకుంటే, పుణె సమీపంలోని యాంబీ వ్యాలీలో గల ఆ సంస్థకు చెందిన రూ. 39వేల కోట్ల విలువ గల ఆస్తులను వేలం వేయడం జరుగుతుందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. తాను గతంలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 17నాటికి రూ.

04/07/2017 - 08:42

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పినా ఆ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో గరిష్ఠంగా 12 శాతం విద్యుత్‌ను ఆ రాష్ట్రానికి ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోందని పేర్కొంటూ, ఈ నిబంధనను మార్చాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

04/07/2017 - 08:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఏయిర్ ఇండియా విమానంలో గొడవ చేసిన లోకసభ సభ్యుడు రవీంద్ర గైక్వాడ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసిన పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంతగీతే, శివసేన ఎంపిలు లోకసభలో కొట్టినంత పని చేశారు.

04/07/2017 - 08:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6:కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు గురువారం పార్లమెంట్ ఆమోదం లభించింది. అనుకున్నట్టుగా జూలై 1 నుంచి జిఎస్‌టి అమలులోకి రావాలంటే అన్ని రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో ఇక రాష్ట్రాల ఆమోదమే మిగిలింది.

04/07/2017 - 08:21

సాహిబ్‌గంజ్ (జార్ఖండ్), ఏప్రిల్ 6:అవినీతి, నల్లధనంపై దేశవ్యాప్తంగా చేపట్టిన పోరాటం తుది వరకూ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ రెండు జాఢ్యాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను చెదలమాదిరిగా దొలిచేశాయని అన్నారు. అయితే ప్రజలు మద్దతు, సహకారంతో వీటికి వ్యతిరేకంగా చేపట్టిన యుద్ధాన్ని ఆపేది లేదని ఉద్ఘాటించారు. కొత్తతరం నిజాయితీని కోరుకుంటోందని ఇది శుభపరిణామమని పేర్కొన్నారు.

Pages