S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/05/2017 - 02:42

బెంగళూరు, ఏప్రిల్ 4: ఆయన ఓ ఎమ్మెల్యే... తలచుకుంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు.. బస చేయొచ్చు... కానీ ఫైవ్‌స్టార్ హోటళ్లేవీ ఆయనకు నచ్చలేదు. హాయిగా రెస్ట్ తీసుకోవటానికి గొడ్లచావిడి కంటే గొప్పదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. కర్ణాటకలోని రాజాజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎస్ సురేశ్ కుమార్ నంజన్‌గూడ్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీనివాసప్రసాద్ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు.

04/05/2017 - 02:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: జాతీయ రహదారులు, స్టేట్ హైవేలకు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం నిర్ద్యంద్వంగా సమర్థిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరిన, కోరని రాష్ట్రాలు మాత్రం రాజకీయాలవారీగా విడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి.

04/05/2017 - 02:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4:ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో తనకు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున తాను ఫీజు లేకుండానే వాదిస్తానని ప్రముఖ న్యాయవాది రామ్‌జత్మలానీ స్పష్టం చేశారు. ఎక్కడ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందోనన్న ఉద్దేశంతోనే తన బిల్లులపై ఉద్దేశపూర్వకంగానే వివాదం సృష్టించారంటూ అరుణ్ జైట్లీపై కూడా ఆయన విరుచుకు పడ్డారు.

04/05/2017 - 02:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బౌద్ధ మత గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించటాన్ని నిలిపివేయాలంటూ చైనా చేసిన హెచ్చరికను భారతదేశం తుంగలో తొక్కింది. అనుకున్న ప్రకారం టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం అరుణాచల్‌లో అడుగు పెట్టడంతో చైనా హెచ్చరిక నీరుగారినట్టయింది.

04/05/2017 - 01:55

లక్నో, ఏప్రిల్ 4: ఉత్తరప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని బిజెపి నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల తరువాత మంగళవారం ఇక్కడ తొలిసారి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న, సన్నకారు రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు.

04/05/2017 - 00:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: రెండు తెలుగు రాష్ట్రాల నియోజక వర్గాల పెంపునకు సంబంధించి హోంశాఖ కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరగనుంది. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఇతర హోంశాఖ అధికారులు పాల్గొననున్నారు.

04/04/2017 - 23:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: మంథని మండలం ఖానాపూర్ యువకుడు మధుకర్ మృతిపై దళిత విద్యార్థి సంఘాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు ధర్నా నిర్వహించాయి. మంగళవారం జెఎన్‌యూలోని విద్యార్థి సంఘం బీర్సా అంబేద్కర్ పూలే స్టూడెంట్ అసోసియేషన్ (బాప్స) ఆధ్వర్యంలో మధుకర్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

04/04/2017 - 23:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: రష్యాలోని పోర్ట్‌సిటీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన పేలుళ్లపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అందరూ ముందుకురావాలని మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై అత్యవసర, సమగ్ర చర్యలు తీసుకోవల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

04/04/2017 - 23:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు విడుదల చేయాలని భావిస్తోంది. వివిధ ప్రభుత్వ విధానాలపై రాజకీయ ఆరోపణలకు దీటుగా జవాబు చెప్పేందుకు తాము సాధించిన విజయాలపై జాతికి నివేదిక సమర్పించాలని పేర్కొంది. వచ్చే నెలలో మోదీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తోంది.

04/04/2017 - 23:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎన్నికల్లో ఓటు వేయడానికి ఇవిఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల కమిషన్ మాత్రం ఇవిఎంలే అత్యంత సురక్షితమైన, విశ్వసనీయమైనవిగా భావిస్తోంది.

Pages