S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/24/2017 - 02:41

ముంబయి, ఫిబ్రవరి 23: బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని, ఆ పార్టీ నగర అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఈ రెండేళ్లు పార్టీబలోపేతానికి కృషి చేశానని ఆయన మీడియాతో అన్నారు.

02/24/2017 - 02:40

శ్రీనగర్, ఫిబ్రవరి 23: ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ముగ్గురు జవాన్లు మరణించారు. అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో బుల్లెట్ గాయం తగిలి ఒక మహిళ మరణించింది. కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో గురువారం ఈ సంఘటన జరిగింది. చిత్తార్‌గమ్ ప్రాంతంలో భద్రతా దళాలు గస్తీ చేస్తున్నప్పుడు మిలిటెంట్లు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.

02/24/2017 - 01:51

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 (మానవ శరీరంలో 112 చక్రాలు ఉంటాయని ప్రతీతి) అడుగుల అతి పెద్ద శివుడి విగ్రహమిది. కోయంబత్తూర్‌లోని వెల్లియంగి కొండల మధ్య ఏర్పాటు చేసిన ఆదియోగి (శివుడు) ముఖం, భూమీదవున్న విగ్రహాలన్నింటిలోకీ అతి పెద్దదిగా ప్రఖ్యాతిగాంచింది.

02/24/2017 - 01:36

ముంబయి, ఫిబ్రవరి 23: ముంబయి మహానగరంతో పాటుగా మహారాష్టల్రోని మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విజయాలను నమోదు చేసింది. దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ముంబయి కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో బిజెపి, శివసేన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ పడి స్థానాలను గెలుచుకొన్నాయి.

02/23/2017 - 12:09

ఢిల్లీ: కేంద్ర సర్వీసుల కోసం సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేసింది. జూన్ 18వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. సాధారణంగా యూపీఎస్సీ ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తుండగా గత మూడేండ్లుగా ఈ పరీక్షను జూన్‌కి మార్చింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 17వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది.

02/23/2017 - 12:05

ముంబై : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముంబై బీఎంసీ ఎన్నికల్లో శివసేన ఆధిక్యంలో ఉండగా, పుణె పురపాలక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీఎంసీలో శివసేన 36 వార్డుల్లో, బీజేపీ 24, కాంగ్రెస్ 6, ఎంఎన్‌ఎస్ 4, ఎన్సీపీ 2 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుణెలో బీజేపీ 24 వార్డుల్లో, శివసేన 10, ఎన్‌సీపీ 14, కాంగ్రెస్ 1 వార్డులో ఆధిక్యంలో కొనసాగుతోంది.

02/23/2017 - 11:58

చెన్నై: చెన్నైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పల్లవాన్‌పాంగన్‌ సమీపంలో ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు అదుపుతప్పి కింద పడిపోయారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు యువకులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

02/23/2017 - 11:48

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహోబ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్‌పీ మద్దతుదార్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సిద్ధగోపాల్‌ సాహు కుమారుడు కూడా గాయపడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగో విడతలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ మొదలైంది.

02/23/2017 - 08:24

వారణాసి, ఫిబ్రవరి 22: ఉత్తరప్రదేశ్‌లో ఒక వేళ ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాని పక్షంలో బిఎస్పీతో కానీ, మరే పార్టీతో కానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాదు, పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగానే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని కూడా ఆయన చెప్పారు.

02/23/2017 - 08:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్‌లో ఉత్తీర్థులైన అభ్యర్థుల వ్యక్తిత్వ పరీక్షలు మార్చి 20 నుంచి ప్రారంభమవుతాయని యుపిఎస్‌సి బుధవారం వెల్లడించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏటా మూడు దశల్లో యుపిఎస్‌సి నిర్వహిస్తుంది.ప్రిలిమినరీ, మెయిల్, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులైన వారిని ఐఏఎస్,ఐఎఫ్‌ఎస్,ఐపిఎస్ తదితర విభాగాలకు ఎంపిక చేస్తారు.

Pages