S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/23/2017 - 08:21

ఇంఫాల్, ఫిబ్రవరి 22: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.‘ఎన్నికలు ప్రశాంతగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం. ఆర్థిక దిగ్బంధం ప్రభారం ఏమాత్రం ఉండబోదని నమ్ముతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు భరోసా ఇచ్చింది. సమాజంలోని అన్ని వర్గాలు ఇందుకు సహకరించాలి’అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ స్పష్టం చేశారు.

02/23/2017 - 08:20

లక్నో, ఫిబ్రవరి 21: ఉత్తరప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. 12 జిల్లాల్లో విస్తరించి ఉన్న 53 అసెంబ్లీ నియోజకవర్గాలలో గురువారం పోలింగ్ జరుగనుంది. వెనుకబడిన బుందేల్‌ఖండ్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గురువారం పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ఉన్నాయి.

02/23/2017 - 08:19

ముంబయి, ఫిబ్రవరి 22: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజకీయ ప్రస్థానం మొదలై ఐదు దశాబ్దాలైంది. ఈ 50 ఏళ్ల ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో పవార్ అనేక ఎత్తుపల్లాలు చూశారు. జాతీయ రాజకీయాల్లో మహారాష్టక్రు ఓ ప్రత్యేక స్థానం కల్పించడంతో ఆయన కృషి మరువలేం. శరద్ పవార్ రాజకీయ ప్రయాణంపై ఆయన కుమార్తె, బారామతి లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సులే అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు.

02/23/2017 - 08:18

కోహిమా, ఫిబ్రవరి 22: నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా షుర్‌తోజెలీ లీజిట్సు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ పిబి ఆచార్య రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 81 ఏళ్ల లీజిట్సుతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ముఖ్యమంత్రి ప్రస్తుతం నాగాలాండ్ విధానసభలో సభ్యుడు కారు.

02/23/2017 - 08:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సట్లేజ్- యమున సంధాన కాలువ (ఎస్‌వైఎల్) నిర్మాణాన్ని చేపట్టాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వును అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు బుధవారం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలను పరిరక్షించాలని స్పష్టం చేసింది.

02/23/2017 - 05:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22:బ్యాంకులు, ఎటిఎమ్‌ల నుంచి డబ్బులు డ్రా చేస్తే వాటికి తిరుగుండదని భావిస్తాం! వాటిని మళ్లీ చూసుకోకుండా లెక్క పెట్టుకుని జేబులో పెట్టేసుకుంటాం.. కానీ దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బిఐ ఎటిఎమ్ నుంచే ఏకంగా కొత్త రెండు వేల రూపాయల నకిలీ నోట్లు వచ్చాయి. వీటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది.

02/22/2017 - 12:26

న్యూఢిల్లీ: ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో కొత్త‌వి తెచ్చే ఆలోచ‌న లేన‌ట్లు ఆర్థిక వ్య‌వ‌హ‌రాల కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత‌దాస్ స్ప‌ష్టంచేశారు. ప్ర‌స్తుతానికి త‌మ దృష్టంతా సాధ్య‌మైన‌న్ని ఎక్కువ 500, అంత‌క‌న్నా త‌క్కువ డినామినేష‌న్ నోట్ల‌నే ముద్రించడంపైనేన‌ని దాస్ ట్వీట్ చేశారు.

02/22/2017 - 12:25

చెన్నై: తమిళనాడు వ్యాప్తంగా ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేడు నిరాహార దీక్ష ఆందోళన చేపట్టింది. ప్రతి జిల్లా కేంద్రంలో దీక్షలు కొనసాగుతున్నాయి. తిరుచ్చిలో చేపట్టిన దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో పోలీసు బలగాలను మోహరించడాన్ని నిరసిస్తూ డీఎంకే ఈ నిరసన కార్యక్రమానికి దిగింది.

02/22/2017 - 03:03

తిరువళ్ల (కేరళ), ఫిబ్రవరి 21: కుల మతాల ప్రాతిపదికన కొందరు వ్యక్తులు సమాజాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత నాగరికత అత్యంత ఉన్నతం, ఘనమైనదని, శతాబ్దాల చరిత్రలో ఈ రకాల సవాళ్లు ఎన్నింటిలో అధిగమించిందని స్పష్టం చేశారు.

02/22/2017 - 03:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: లింగ వివక్ష రూపుమాపాలంటే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ఒక్కటే మార్గమని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ, పంచాయితీ రాజ్ సంస్థల్లో మహిళలకు కోటా కల్పించడంతో లింగ వివక్ష తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది.

Pages