S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2017 - 12:49

చెన్నై:తమిళనాడు శాసనసభలో ఈ నెల 18న నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రతిపక్ష లేకుండా నిర్వహించిన విశాస పరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ డీఎంకే ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్‌ పెట్టాలని కోరినా సభాపతి పట్టించుకోలేదని.. మార్షల్స్‌ దాడి చేశారని పేర్కొంది.

02/21/2017 - 03:41

చెన్నై, ఫిబ్రవరి 20: ఓ పక్క మలయాళ నటి భావనపై లైం గిక వేధింపుల ఆరోపణల కేసు ఓ కొలి క్కి రాకముందే మరో తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తనపైనా ఓ టెలివిజన్ చానల్ ఎగ్జిక్యూటివ్ అధికారి అనుచితంగా ప్రవర్తించారని సోమవారం ఆరోపించారు. ఒక చానల్‌లోప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తున్న అతను తనతో తప్పుగా వ్యవహరించారన్నారు. ‘‘ఆయన మనం బయట ఎప్పుడు కలుద్దాం అని నన్నడిగారు. ఏదైనా పని కోసమా అని నేను ఆయన్ని అడిగాను.

02/21/2017 - 02:38

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తనదైన ముద్ర పడే దిశగా పరిపాలన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నడిపిస్తున్న 500 మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది కాలంలో రాష్ట్రంలో మూసివేసిన మద్యం షాపుల సంఖ్య దీంతో వెయ్యికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం ముఖ్యమంత్రి పళనిస్వామి సంతకం చేశారు.

02/21/2017 - 02:35

జలౌన్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: సంపదను కూడబెట్టినవారు ప్రజా సమస్యలను పరిష్కరించలేరని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ రీజియన్ జలౌన్‌లో సోమవారం బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ సంపదను కూడబెట్టుకున్న వారు ఎన్నటికీ ప్రజల సమస్యలు పరిష్కరించలేరని పరోక్షంగా మాయావతిపై ధ్వజమెత్తారు.

02/21/2017 - 02:33

సుల్తాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: ‘ప్రధాని నరేంద్ర మోదీ దళిత వ్యతిరేకి. బహుజన సమాజ్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు. హోదాను మర్చిపోయి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. బిఎస్పీని బెహెన్‌జీ సంపత్తి పార్టీ (సోదరి ఆస్తుల పార్టీ) అంటూ కించపర్చడం ఆయన హోదాకు తగదు.

02/21/2017 - 02:31

బాందా (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు ఒక్కటి కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖంపై నవ్వు తుడిచిపెట్టుకు పోయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘గతంలో ప్రధాని మోదీ ఎంతో హుషారుగా కనిపించేవారు. కాని, కాంగ్రెస్, ఎస్‌పిలు కూటమి కట్టడంతో ఆయన ముఖంపైనుంచి చిరునవ్వు చెదరిపోయింది’ అని ఆయన అన్నారు.

02/21/2017 - 02:30

ముంబయి, ఫిబ్రవరి 20: అంధేరీ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి కారు నడిపిన 24 ఏళ్ల క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. 2012లో జరిగిన అండర్ 19 ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో ఆడిన హర్మీత్ సింగ్ ఉదయం 7.30 గంటల సమయంలో సరాసరి కారుతో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో ప్లాట్‌ఫామ్ రద్దీగా ఉండడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు.

02/21/2017 - 02:28

చెన్నై, ఫిబ్రవరి 20: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం డిఎంకె సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డిఎంకె లాయర్, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.షణ్ముగ సుందరమ్ ఈ పిటిషన్ వేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

02/21/2017 - 02:27

చెన్నై, ఫిబ్రవరి 20: అసెంబ్లీలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ధనపాల్ తన వర్గాన్ని రక్షించుకోవడానికి అవాంఛనీయ ఘటనలను ప్రేరేపించారని ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ ఆరోపించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా స్వీకర్ వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.

02/21/2017 - 02:27

న్యూడిల్లీ, ఫిబ్రవరి 20: సిబిఐ మాజీ డైరెక్టర్ అమర్‌ప్రతాప్ సింగ్‌పై ఆ సంస్థ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీకి లబ్ధి చేకూర్చారన్న అభియోగాలపై సిబిఐ ఆయనపై కేసు పెట్టింది. అమర్ ప్రతాప్‌సింగ్‌తో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న ఆదిత్య శర్మ, ట్రైమాక్స్ గ్రూప్ కంపెనీల యజమాని కోనేరు ప్రదీప్‌పై కూడా కేసులు నమోదు చేసింది.

Pages