S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/20/2017 - 08:35

ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) ప్రభుత్వం విఫలమయిందని, రాష్ట్రంలో ‘గూండాల రాజ్యం’ నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రేప్ కేసులో ఒక మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది అని ఆదివారం ఇక్కడ బిజెపి నిర్వహించిన ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ అన్నారు.

02/20/2017 - 08:33

పనాజీ, ఫిబ్రవరి 19: అండమాన్, నికోబార్ దీవుల్లోని అగ్నిపర్వతం నుంచి మళ్లీ పొగలు, లావా ఉబికి వస్తున్నాయి. మన దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఇదే. బారెన్ ఐలెండ్‌లో 150 ఏళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో బద్ధలైందని, ఆ తర్వాత నుంచి చెదురు మదురుగా పేలుళ్లు సంభవిస్తున్నాయని గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) శాస్తవ్రేత్తలు తెలిపారు.

02/20/2017 - 08:33

గౌహతి, ఫిబ్రవరి 19: మరుగుదొడ్డి లేని ఇంట్లో ఇక నిఖా (పెళ్లి) జరుగదు. అవును, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మరుగుదొడ్డి లేని ఇంట్లో వివాహాలు జరిపించకూడదని వౌల్వీలు, ముఫ్తీలు నిర్ణయించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింల పెళ్లిళ్లు జరగాలంటే ఆయా ఇళ్లలో మరుగుదొడ్లు ఉండటం తప్పనిసరి అని జమియత్ ఉలేమా ఐ హింద్ సెక్రెటరి జనరల్ వౌలానా మహమూద్ ఎ మదాని చెప్పారు.

02/20/2017 - 08:32

ఇండోర్, ఫిబ్రవరి 19: పార్లమెంటుపై ప్రజల విశ్వాసం ఎన్నికయిన ప్రతినిధుల బాధ్యతాయుతమైన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. పార్లమెంటుపై ప్రజల విశ్వసనీయత అనేది దాని నిష్కాపట్యం, పారదర్శకత, అందుబాటులో ఉండడం, ఎన్నికయిన ప్రతినిధుల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’ అని ఆమె అన్నారు.

02/20/2017 - 08:31

ఝాన్సీ (ఉత్తరప్రదేశ్), ఫిబ్రవరి 19: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

02/19/2017 - 07:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మార్చి 21న కోర్టు ఎదుట హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా శనివారం ఆదేశించారు.

02/19/2017 - 07:32

పనాజి, ఫిబ్రవరి 18: దేశంలో నిరుపయోగంగా ఉన్న 43 విమానాశ్రయాలను మరో ఏడాదిలోగా ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. దేశంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపర్చడమే నిరుపయోగంగా ఉన్న ఈ 43 విమానాశ్రయాలను ఉపయోగంలోకి తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ చౌబే విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.

02/19/2017 - 07:31

చెన్నై, ఫిబ్రవరి 18: పళనిస్వామి విశ్వాస ప్రకటన ఓటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ప్రతిపక్షాలన్నీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ‘రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని దేశవ్యాప్తంగా అందరూ కోరుకుంటుంటే తమిళనాడులో మాత్రం అది పోట్లాటతో ముగిసింది’ అని బిజెపి వ్యాఖ్యానించింది. ‘్ఫలితం ఏమయినప్పటికీ ఎలాంటి కుంభకోణాల కళంకం లేని ప్రభుత్వం కావాలనే అందరి ఆకాంక్ష.

02/19/2017 - 07:31

చెన్నై, ఫిబ్రవరి 18: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన పరిణామాలపై ప్రముఖ నటుడు కమలహాసన్ తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించడంపై ఆయన స్పందిస్తూ ‘మరో ముఖ్యమంత్రి వచ్చినట్లుంది. జై డెమోక్రేజీ’ అని అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ‘తమిళనాడు ప్రజలారా, మీమీ ఎమ్మెల్యేలనువారికి తగిన విధంగా స్వాగతించండి’ అని వ్యాఖ్యానించారు.

02/19/2017 - 07:29

చెన్నై, ఫిబ్రవరి 18: తమిళనాడు అసెంబ్లీలో శనివారం విశ్వాస ప్రకటన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తనపైన, తమ పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడికి నిరసనగా మెరీనా బీచ్‌లో ధర్నాకు దిగిన డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Pages